Ilayaraja: ఇళయరాజాకు ఎదురుదెబ్బ…
ఇటీవల కొన్ని సినిమాల్లో తన పాటలను అనుమతి లేకుండా వాడుతున్నారంటూ ఇళయరాజా కోర్టులో కేసులు వేసి అనుకూలంగా తీర్పులు తెచ్చుకుని సంచలనం సష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే ఇళయరాజాకు ఆయన పాటల విషయంలో ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు తీర్చు ఇవ్వడం ఆయనకు పెద్ద షాక్ అని చెప్పవచ్చు. సంగీత హక్కుల విషయంలో ప్రముఖ ఆడియో సంస్థ ‘సరిగమ’,ఇళయరాజా మధ్య జరుగుతున్న వివాదంలో న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. 1976 నుంచి 2001 మధ్య కాలంలో ఇళయరాజా బాణీలు అందించిన 134 చిత్రాలకు సంబంధించిన ఆడియో హక్కులు సదరు సంస్థకే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది. నాటి చిత్ర నిర్మాతలు ఈ హక్కులను శాశ్వత ప్రాతిపదికన సరిగమకు విక్రయించిన నేపథ్యంలో, ఇప్పుడు వాటిపై ఇళయరాజాకు ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవని జస్టిస్ తుషార్ రావు గెడేలా వెల్లడించారు. అందువల్ల ఆ సంస్థకు చెందిన పాటలను ఉపయోగించకూడదని కోర్టు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13న న్యాయమూర్తి తుషార్ రావు గెడెలా ఈ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ సినిమాల పాటలను ఇటీవల ఇళయరాజా తన పేరుతో అమెజాన్ మ్యూజిక్, ఐట్యూన్స్, జియోసావన్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అప్లోడ్ చేసి, ఇతరులకు లైసెన్స్ ఇస్తున్నారని సరిగమా కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. 1976 నుంచి 2001 మధ్య కాలంలో ఇళయరాజా బాణీలు అందించిన 134 చిత్రాలకు సంబంధించిన ఆడియో హక్కులు సదరు సంస్థకే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది. నాటి చిత్ర నిర్మాతలు ఈ హక్కులను శాశ్వత ప్రాతిపదికన సరిగమకు విక్రయించిన నేపథ్యంలో, ఇప్పుడు వాటిపై ఇళయరాజాకు ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవని జస్టిస్ తుషార్ రావు గెడేలా వెల్లడించారు.

ఇది సుమారు 134 సినిమాలకు చెందిన పాటలపై వర్తిస్తుంది. ఈ పాటలను ఇకపై ఉపయోగించకూడదని, లైసెన్స్ ఇవ్వకూడదని, మూడో వ్యక్తులకు హక్కులపై ఎలాంటి హామీలు ఇవ్వకూడదని కోర్టు స్పష్టం చేసింది. కాపీరైట్ చట్టం 1957 ప్రకారం, సాధారణంగా సినిమా నిర్మాతకే మొదటి హక్కు ఉంటుందని కోర్టు గుర్తు చేసింది. ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత, ఈ దశలో సారేగమా హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ విషయమై ఇళయరాజా తరఫున అధికారిక స్పందన రావాల్సి ఉంది. ఈ కాపీరైట్ పోరాటం ఇక ముందు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి













