Ilaiyaraaja: మాస్ట్రో ఇళయరాజా 50 ఏళ్ల ప్రస్థాన వేడుక కార్యక్రమాన్ని నిర్వహించనున్న స్పైస్ లాంజ్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్
హైదరాబాద్: భారతదేశపు దిగ్గజ సంగీతకారుల్లో ఒకరైన మాస్ట్రో ఇళయరాజా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని తమ సాంస్కృతిక, ఎక్స్‌పీరియెన్షియల్ ఈవెంట్స్ వేదిక అయిన XORA World, విశిష్ట సంగీత కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు స్పైస్ లాంజ్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ (BSE: 53895) వెల్లడించింది. ఈ భారీ స్థాయి కార్యక్రమం 2026 మార్చి 28న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించబడుతుంది.
XORA World అనేది స్పైస్ లాంజ్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ యొక్క పూర్తి అనుబంధ/గ్రూప్ సంస్థ అయిన రైట్ఫెస్ట్ యొక్క ప్రొప్రైటరీ ప్లాట్‌ఫాం. XORA Worldకి ఈ కార్యక్రమం ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. ప్రధానమైన ఆహార, పానీయాల వ్యాపారాలకు తోడుగా ఎక్స్పీరియన్స్ ఆధారిత కన్జూమర్ ప్లాట్‌ఫాంలలోకి కంపెనీ యొక్క వ్యూహాత్మక విస్తరణను ప్రతిఫలిస్తుంది.
అయిదు దశాబ్దాల కెరియర్లో మాస్ట్రో ఇళయరాజా 7,000కు పైగా పాటలకు స్వరకల్పన చేశారు. బహుళ భాషల్లో వేలకొద్దీ చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అన్ని తరాలవారినీ ఆకట్టుకునే సంగీతాన్ని అందిస్తూ విశిష్టమైన సాంస్కృతిక ఐకాన్‌గా ఆయన సుస్థిర స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడమనేది జాతీయ స్థాయిలో అత్యంత ప్రభావం చూపే సాంస్కృతిక అనుభవాలను అందించాలనే XORA World యొక్క లక్ష్యానికి నిదర్శనంగా ఉంటుంది.
వ్యూహాత్మక సందర్భం మరియు వ్యాపార ఔచిత్యం
సంప్రదాయ రెస్టారెంట్ ఫార్మాట్ పరిధిని దాటి ప్రధానమైన ఆహార మరియు పానీయాల ప్లాట్‌ఫాంనకు అనుబంధంగా ఉండే సాంస్కృతిక కార్యక్రమాలు, లైవ్ ఎక్స్‌పీరియన్స్‌లు సహా ఎక్స్‌పీరియెన్షియల్ మరియు లైఫ్‌స్టయిల్ విభాగాల్లోకి కంపెనీ స్థిరంగా కార్యకలాపాలను విస్తరిస్తోంది.
ఈ కార్యక్రమాల ప్రధాన లక్ష్యాలేమిటంటే:
· కంపెనీ యొక్క డైరెక్ట్-టు-కన్జూమర్ ఎంగేజ్మెంట్ సామర్థ్యాలను పటిష్టం చేసుకోవడం
· పటిష్టమైన సాంస్కృతిక, భావోద్వేగాలను ప్రతిఫలించే స్వంత ప్లాట్‌ఫాంలను నిర్మించడం
· కీలకమైన పట్టణ ప్రాంత మార్కెట్లలో వినియోగదారులకు అత్యధిక విజిబిలిటీ ఉండే టచ్పాయింట్లను సృష్టించడం
· బ్రాండ్ రికాల్ను పెంపొందించడం మరియు కంపెనీ వ్యాపారాలవ్యాప్తంగా సామర్థ్యాలను సమన్వయపర్చుకోవడం
“మాస్ట్రో ఇళయరాజా ఒక సంగీతకారుడు మాత్రమే కాదు, ఎన్నో తరాలను తన సంగీతంతో తీర్చిదిద్దిన ఒక విశిష్టమైన సాంస్కృతిక సంస్థలాంటివారు. ఆయన 50 ఏళ్ల ప్రస్థానాన్ని వేడుకగా జరుపుకోవడమనేది ఒక అరుదైన, ప్రతిష్టాత్మకమైన అవకాశం. XORA Worldకి సంబంధించి ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుంది. విస్తృత ఫార్మాట్లో, సంస్కృతిని ప్రతిధ్వనించే వేదికలను రూపొందించడంలో మా సామర్థ్యాలను తెలియజేస్తుంది. ఆహార పరిధికి మించి అనుభూతులు, సంస్కృతి, కమ్యూనిటీవ్యాప్తంగా వినియోగదారుల ఆధారిత లైఫ్‌స్టయిల్ వ్యవస్థను సృష్టించాలన్న స్పైస్ లాంజ్ ఫుడ్ వర్క్స్ విజన్‌ని పునరుద్ఘాటిస్తుంది” అని స్పైస్ లాంజ్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ చైర్మన్ మరియు డైరెక్టర్ Mr. మోహన్ బాబు Karjela (Mohan Babu Karjela) తెలిపారు.






