ఏపీ ప్రభుత్వ విధానాలు పై గేట్స్ ప్రశంసలు! ‘నైస్, గుడ్, గ్రేట్’ అంటూ బిల్ గేట్స్ కీలక అభినందనలు
బిల్ గేట్స్ అమరావతి పర్యటన హైలైట్స్
• గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటన ఆసక్తికరంగా సాగింది.
• గత అనుభవాలను గుర్తు చేసుకుంటూ… భవిష్యత్ ప్రణాళికలపై చర్చించకునేలా బిల్ గేట్స్ పర్యటన జరిగింది.
• గేట్స్ పై ఉన్న అపారగౌరవంతో నారా లోకేష్ సహా నలుగురు మంత్రులను గన్నవరం విమానాశ్రయానికి పంపి స్వాగతం పలికారు.
• సచివాలయంలో మొదటి బ్లాకులో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ కు ఆత్మీయ స్వాగతం పలికారు.
• మొదటి బ్లాక్ వద్ద తనకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబును చూడగానే కారు దిగుతూనే హలో ఫ్రెండ్…! హౌ ఆర్ యూ.. అంటూ గేట్స్ ముఖ్యమంత్రిని అప్యాయంగా పలకరించారు.
• ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సహా ఇతర కెబినెట్ మంత్రులను బిల్ గేట్స్ కు సీఎం చంద్రబాబు పేరు పేరునా పరిచయం చేశారు.
• బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ సందర్భంగా తన ఛాంబర్లోకి వచ్చిన బిల్ గేట్స్ కు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నిలువెత్తు చిత్రపటాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించారు.
• శ్రీవారి ప్రాసస్త్యాన్ని.. తిరుమల క్షేత్రం గొప్పదనాన్ని బిల్ గేట్స్ కు సీఎం వివరించారు.
• గేట్స్ ఫౌండేషన్ బృందంతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ అనంతరం ఆర్టీజీ సెంటర్ కు గేట్స్ ను తీసుకెళ్లిన ముఖ్యమంత్రి.. ఆ విభాగం పనితీరును వివరించారు.
• పాలనా వ్యవహరాల్లో, విపత్తుల్లో, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించే విషయంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఏ విధంగా వినియోగించుకుంటున్నామనే అంశాన్ని ఉదాహరణలతో సహా ముఖ్యమంత్రి వివరించారు.
• గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో కుప్పంలో చేపట్టిన సంజీవని ప్రాజెక్టు ప్రోగ్రస్ ను ముఖ్యమంత్రి వివరించగా… దట్స్ నైస్ అంటూ మెచ్చుకున్నారు.
• ఆరోగ్య రంగంలో ఏఐ వినియోగం గురించి గ్రేట్ అంటూ గేట్స్ అభినందించారు.
• డేటా లేక్, వాట్సాప్ గవర్నన్స్ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడాన్ని అభినందించారు.
• వ్యాధి నిర్ధారణ పరీక్షలు తక్కువ ధరకే అందించగలిగితే… పేద వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయపడిన గేట్స్
• అమరావతి రాజధాని ప్రణాళికలను.. బ్లూ-గ్రీన్ కాన్సెప్టును, అత్యాధునిక పద్దతుల్లో ఫ్యూచర్ సిటీగా నిర్మిస్తున్న విధానాన్ని తెలుసుకున్న బిల్ గేట్స్ గ్రేట్ వర్క్ అంటూ రాజధాని మాస్టర్ ప్లాన్ ను మెచ్చుకున్నారు.

• భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎటువంటి వ్రణాళికలతో రాజధాని నిర్మిస్తున్నామనే విషయాన్ని సీఎం చంద్రబాబు వివరించారు.
• రాజధాని ప్రాంతంలో మొత్తంగా గ్రీన్ ఎనర్జీనే వినియోగించే దిశగా… ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్టు గేట్స్ కు సీఎం చెప్పారు.
• అనంతరం మంత్రులు, సెక్రటరీల సమావేశానికి గేట్స్ ను తీసుకు వచ్చిన చంద్రబాబు… ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలు, లక్ష్యాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
• ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ హైదరాబాద్ కు రావడానికి దారి తీసిన పరిస్థితులపై కొద్దిసేపు చర్చ జరిగింది.
• ముఖ్యమంత్రితోపాటు.. గేట్స్ కూడా నాటి ఢిల్లీ సమావేశం… సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు, అమెరికా వెలుపల తొలి డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు కావడం గురించి సమావేశంలో ఉన్న మంత్రులు, సెక్రటరీలకు వివరించారు.
• తొలి మీటింగ్ లోనే చంద్రబాబు విజనరీ ఆలోచనలను తాను గమనించానని బిల్ గేట్స్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
• మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబు బిల్ గేట్స్ ను వివిధ అంశాలపై ప్రశ్నల ద్వారా బిల్ గేట్స్ అభిప్రాయాలు తెలుసుకున్నారు.
• అక్కడి నుంచి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన బిల్ గేట్స్ బృందం సాగులో టెక్నాలజీ అమలు చేస్తున్న విధానాన్ని పరిశీలించి… ప్రశంసించారు.
• ప్రకృతి సాగు గురించి రైతులు అధికారులతో చర్చించిన బిల్ గేట్స్… ఆ పంట ఉత్పత్తులను పరిశీలించారు.
• చీడపీడలకు సంబంధించే వివరాలు అందించే AP-AIMS (ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం) మొబైల్ యాప్ పనితీరును బిల్ గేట్స్ పరిశీలించారు.
• రైతు ఫోన్ ద్వారా ఈ యాప్ ను ఉపయోగించి పంటకు వచ్చిన తెగులును గుర్తించడమే కాకుండా… డ్రోన్ ద్వారా మందుల పిచికారి చేసే విధానాన్ని కూడా గేట్స్ పరిశీలించారు.
• వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన బిల్ గేట్స్ కు రైతులు స్థానిక వంటకాలను రుచి చూపించారు.
ఇవి కూడా చదవండి













