Rashmika: రష్మిక–విజయ్ పెళ్ళికి వెళ్ళేది వాళ్ళేనా..?
ఎట్టకేలకు టాలీవుడ్ స్టార్ జంట రష్మిక – విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)ల వివాహం జరగబోతోంది. వివాహ తేదీలను కూడా ఎనౌన్స్ చేశారు. ఇక వివాహానికి ఎవరు వెళ్తారు, ఏంటనే దానికి సంబంధించి సోషల్ మీడియాలో హడావుడి మొదలైంది. దాదాపు 6 ఏళ్ల నుంచి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. వీళ్ళిద్దరూ ఎక్కడా కూడా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయకపోయినప్పటికీ, సోషల్ మీడియా హడావుడి మాత్రం పిక్స్ లో నడిచింది. రష్మిక మందన ఒకపక్క సినిమాల్లో బిజీ ఉండగా విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలు మాత్రం ఇబ్బంది పెడుతున్నాయి.
ఇక ఫైనల్ గా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు వీళ్ళ పెళ్లికి వెళ్లే వాళ్లకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని పేర్లు వైరల్ గా మారాయి. అందులో కొన్ని పేర్లు గనుక పరిశీలిస్తే.. పెళ్లిచూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ వీరి పెళ్ళికి వెళ్లే అవకాశం ఉంది. ఆ సినిమా తర్వాతనే విజయ్ దేవరకొండ కాస్త ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. ఇక సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) కూడా వీళ్ళ పెళ్లికి వెళ్ళవచ్చు అంటూ ప్రచారం జరుగుతుంది. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా విజయ్ దేవరకొండ ఇమేజ్ మార్చేసింది సందీప్ రెడ్డి వంగా.
యానిమల్(Animal) సినిమా ద్వారా రష్మిక మందనకు నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ పెంచాడు సందీప్ రెడ్డి. అందుకే వీళ్ళిద్దరి కామన్ ఫ్రెండ్ అయినా సందీప్ రెడ్డి ని పిలిచే ఛాన్స్ కనబడుతోంది. అదేవిధంగా కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఒకరిద్దరిని రష్మిక మందన పిలిచే అవకాశం ఉండవచ్చు. అందులో మొదటిగా వినపడుతున్న పేరు రక్షిత్ శెట్టి. అతనితో రష్మిక మందన ముందు నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ ఇద్దరి మధ్య స్నేహం మాత్రం కొనసాగుతూనే ఉంది. అలాగే పెళ్లిచూపులు సినిమాలో కమెడియన్ గా నటించిన ప్రియదర్శిని కూడా వివాహానికి పిలిచే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కూడా వివాహానికి హాజరు కావచ్చు. అలాగే మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ మాత్రమే వివాహానికి హాజరయ్యే అవకాశం ఉండవచ్చును అని ప్రచారం జరుగుతుంది.













