Maharashtra: కుక్కలా మారి.. మీద పడి.. ఇతనికేమైంది?
Maharashtra: మహారాష్ట్రలోని సాతారా-రహిమత్పూర్ రహదారిపై ప్రయాణికులు ఒక భయంకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నారు. అంగాపూర్ ఫాటా సమీపంలో ఒక వ్యక్తి అకస్మాత్తుగా కుక్కలా ప్రవర్తిస్తూ రోడ్డుపై వెళ్లే వాహనాలపైకి దూకుతూ కలకలం సృష్టించాడు.
ఏం జరిగింది?
సదరు వ్యక్తి రోడ్డు మధ్యలోకి వచ్చి వెళ్లే కార్లు, బైక్లను అడ్డుకోవడమే కాకుండా, కుక్కలా అరుస్తూ ప్రయాణికులను కరిచేందుకు ప్రయత్నించాడు. ఈ వింత ప్రవర్తనతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు సెల్ఫోన్లలో చిత్రీకరించగా, ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
అసలు కారణం ఇదే:
మొదట్లో ఆ వ్యక్తి ‘రేబీస్’ వ్యాధి బారిన పడి ఇలా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు భావించారు. అయితే, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించగా అసలు విషయం బయటపడింది. ఆ వ్యక్తి రేబీస్ వల్ల కాకుండా, తీవ్రమైన మానసిక వ్యాధి(Mental Illness) తో బాధపడుతున్నాడని వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అతనికి వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నారు.













