Vijayawada: బెజవాడ మేయర్ గా వంగవీటి వారసురాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి(Vangaveeti) కుటుంబానికి కాస్త ప్రత్యేక స్థానం ఉంటుంది. దివంగత వంగవీటి రంగా రాజకీయ వారసత్వం పై ఎప్పుడు ఏదో ఒక చర్చ మనం చూస్తూనే ఉంటాం. వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా రాజకీయాల్లో ఉన్నప్పటికీ, ఆయన పెద్దగా యాక్టివ్ గా లేరు.. అనే ఆవేదన రంగ అభిమానుల్లో కనపడుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు రంగా కుటుంబం నుంచి ఆయన కుమార్తె ఆశ కిరణ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఏ పార్టీలో చేరకపోయినప్పటికీ, ప్రజల్లో ఉంటానంటూ ఆమె చేసిన ప్రకటనలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ఆమెకు తెలుగుదేశం(TDP) పార్టీ లేదా జనసేన(Janasena) పార్టీలు ఆహ్వానం పలుకుతున్నాయని వార్తలు కూడా వచ్చాయి.
అయితే ఇప్పుడు మరో వార్త బెజవాడ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వంగవీటి ఆశ కిరణ్, విజయవాడ మేయర్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు ప్రచారం మొదలైంది. గత కార్పొరేషన్ ఎన్నికల్లో(Corporation Elections) మహిళను అప్పటి వైసిపి ప్రభుత్వం మేయర్ గా ఎంపిక చేసింది. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, కూటమి కూడా మహిళా నాయకురాలిని మేయర్ గా ఎంపిక చేసే అవకాశం ఉండవచ్చు. త్వరలోనే ఆమె జనసేన లేదా టిడిపిలో జాయిన్ అయ్యే అవకాశం ఉండవచ్చని.. ఈ ఏడాది చివర్లో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమె కార్పొరేటర్ గా నిలబడే అవకాశాలు ఉండవచ్చును అంటూ హడావుడి మొదలైంది.
కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు చీలకుండా, కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. జనసేన రూపంలో మెజారిటీ కాపు సామాజిక వర్గం కూటమి వైపు ఉండగా.. వంగవీటి కుటుంబం ద్వారా కొంత కాపు సామాజిక వర్గాన్ని తమ వైపుకు తిప్పుకోవాలని వైయస్ జగన్ భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు వంగవీటి ఆశా కిరణ్ ద్వారా.. కాపు సామాజిక వర్గంలో చీలిక తీసుకురాకుండా ఉండే దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలోనే వంగవీటి రాధకు ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఇదే సమయంలో వంగవీటి రంగా కుమార్తెకు కూడా విజయవాడ మేయర్ పదవిని ఖరారు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండకపోవచ్చు. దీనిపై ఇప్పటికే కూటమి పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం.













