Supreme Court: పెళ్లికి ముందు రిలేషన్ జాగ్రత్త..!
పెళ్లికి ముందు రిలేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది. తాజాగా ఓ కేసును విచారిస్తున్న సందర్భంగా సుప్రీం కోర్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అత్యాచారం ఆరోపణలు, పెళ్లి చేసుకుంటాను అంటూ ఇచ్చిన హామీకి సంబంధించిన కేసులో బెయిల్(Bail) పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు సోమవారం వివాహానికి ముందు సంబంధాలపై మౌఖిక వ్యాఖ్యలు చేసింది.
ఒక మహిళను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి, ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకుని, ఆ తర్వాత మరొక మహిళను వివాహం చేసుకున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ పిటిషన్‌ను జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న మాట్లాడుతూ, వివాహానికి ముందు శారీరక సంబంధంలోకి ప్రవేశించే ముందు జాగ్రత్త వహించాలనన్నారు. బహుశా మనం పాతకాలపు వాళ్ళమే కావచ్చు కానీ, వివాహానికి ముందు, ఒక అబ్బాయి, అమ్మాయి అపరిచితులుగా ఆమె పేర్కొన్నారు.
వారి మధ్య సంబంధం ఎంత బలంగా ఉన్నా, బలహీనంగా ఉన్నా.. వివాహానికి ముందు వారు శారీరక సంబంధంలో ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోలేకపోతున్నామన్నారు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లికి ముందు ఎవరూ ఎవరినీ నమ్మకూడదని పిటీషన్ దాఖలు చేసిన మహిళకు సూచించారు. వారిద్దరూ 2022లో మ్యాట్రిమోనియల్ సర్వీసెస్(matrimonial Web Site) వెబ్సైట్ ద్వారా కలుసుకున్నారని కోర్టుకు వారి న్యాయవాదులు తెలిపారు. ఆ వ్యక్తి ఆ మహిళను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడని, దాని ఆధారంగా ఆమె దుబాయ్(Dubai) లో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడని ఆమె తరుపు లాయర్లు వాదించారు.
ప్రాసిక్యూషన్ ప్రకారం, ఆ వ్యక్తి 2024 జనవరిలో పంజాబ్(Pujab)లో రెండవ మహిళను వివాహం చేసుకున్నాడని సదరు మహిళ ఆలస్యంగా గుర్తించింది. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న పెళ్లికి ముందు దుబాయ్ ఎందుకు వెళ్ళారని ప్రశ్నించారు. ఇక దీనిపై స్పందించిన సుప్రీం కోర్ట్.. మధ్యవర్తుల ద్వారా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని.. ఏకాభిప్రాయ సంబంధం ఉన్నప్పుడు.. దోషులుగా నిర్ధారించాల్సిన కేసులు కావని ధర్మాసనం వ్యాఖ్యానించింది.













