Small Scale Business: పెట్టుబడి రూ.లక్ష.. రూ.50 వేలకు తగ్గని లాభం
Small Scale Business: చాలామందికి సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని ఉన్నా, భారీ పెట్టుబడి లేక లేదా సరైన ఆలోచనలు తట్టక ఆగిపోతుంటారు. ఇష్టం లేని ఉద్యోగాల్లో యంత్రంలా పనిచేసే బదులు, కేవలం రూ. 60 వేల నుండి రూ. 1 లక్ష లోపు పెట్టుబడితో గ్రామాల్లోనే నెలకు మంచి ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాల గురించి ఇప్పుడు చూద్దాం.
1. డెయిరీ వ్యాపారం:
గ్రామాల్లో పశువుల పెంపకం సులభం. రూ. 80 వేల నుంచి లక్ష రూపాయల పెట్టుబడితో రెండు ఆవులు లేదా గేదెలను కొనుగోలు చేసి పాలు అమ్మడం ప్రారంభించవచ్చు. పాలు మాత్రమే కాకుండా పెరుగు, పన్నీర్ వంటి ఉత్పత్తులు తయారు చేస్తే నెలకు రూ. 15,000 నుంచి రూ. 25,000 వరకు లాభం పొందవచ్చు.
2. మొబైల్ రిపేరింగ్, యాక్సెసరీస్:
ప్రస్తుతం ప్రతి చేతిలోనూ స్మార్ట్ఫోన్ ఉంది. కానీ గ్రామాల్లో వీటి రిపేర్ కోసం దూరంగా ఉన్న పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. రూ. 60 వేల నుంచి లక్ష రూపాయల పెట్టుబడితో ఒక చిన్న షాపు పెట్టి రిపేర్లతో పాటు చార్జర్లు, ఇయర్ఫోన్లు అమ్మితే నెలకు రూ. 20,000 పైగా సంపాదించవచ్చు.

3. కిరాణా దుకాణం:
గ్రామాల్లో అన్ని కాలాల్లోనూ నడిచే వ్యాపారం కిరాణా కొట్టు. కేవలం రూ. 1 లక్ష పెట్టుబడితో బియ్యం, పప్పులు వంటి నిత్యావసర సరుకులతో దుకాణం ప్రారంభించవచ్చు. కస్టమర్లతో మంచి సంబంధాలు ఉంటే స్థిరమైన ఆదాయం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
4. పౌల్ట్రీ ఫామ్ (కోళ్ల పెంపకం):
సుమారు రూ. 80 వేల పెట్టుబడితో 100 నుండి 200 కోళ్లతో చిన్న స్థాయిలో పౌల్ట్రీ ప్రారంభించవచ్చు. మాంసం, గుడ్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది కాబట్టి, సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే తక్కువ కాలంలోనే పెట్టుబడి తిరిగి వస్తుంది.
5. ఫుడ్ ప్రాసెసింగ్ (మసాలా పొడుల తయారీ):
గ్రామాల్లో పండే మిరపకాయలు, పసుపు కొమ్ములను సేకరించి వాటిని పొడి చేసి ప్యాకింగ్ చేసి అమ్మడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. రూ. 70 వేల నుంచి లక్ష రూపాయల పెట్టుబడితో గ్రైండింగ్ మిషన్లు కొనుగోలు చేసి, ఈ ఉత్పత్తులను స్థానిక సంతల్లో లేదా పక్కనే ఉన్న పట్టణాల్లో విక్రయించి 20 నుండి 30 శాతం మార్జిన్ పొందవచ్చు.
ఇవి కూడా చదవండి













