ASBL: వినోదభరితం…అనుబంధాల సహితం… ఆకట్టుకున్న ఎఎస్‌బిఎల్ ఫ్యామిలీ డే…
ఉమ్మడి కుటుంబ భావనను ప్రోత్సహిస్తూ, సిబ్బంది, ఖాతాదారులు అందరూ ఒక కుటుంబమేనంటూ హైదరాబాద్‌కి చెందిన ఎఎస్‌బిఎల్ సంస్థ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని అన్వయ కన్వెన్షన్స్ లో నిర్వహించిన ఎఎస్‌బిఎల్ ఫ్యామిలీ డే ఆకట్టుకుంది, ప్రముక సంప్రదాయ నృత్య శిక్షణా సంస్థ నృత్యప్రియ ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్య ప్రదర్శన, శ్రావ్య మానస నృత్య బృందం సమర్పించిన రామాయణ స్కిట్, మహిళా నృత్యబృందం యో హైనెస్చే వినూత్న నృత్య ప్రదర్శన, నిరవల్ – ది బ్యాండ్ లైవ్ షో వంటివి సంప్రదాయ, ఆధునిక సంగీత శైలుల మేళవింపుగా ఈవెంట్‌ని ఇంపుగా మార్చాయి. ఇంటరాక్టివ్ కార్యకలాపాలు, రిఫ్రెష్మెంట్లు, మ్యూజికల్ ఓపెన్ మైక్, డిజె నైట్ అహుతులను అలరించాయి. సంస్థ సిఇఓ అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ కుటుంబ సమేతంగా ఆనందించే ఈవెంట్స్ చక్కని వినోదాన్ని మాత్రమే కాకుండా బలమైన అనుబంధాలను కూడా అందిస్తాయన్నారు.
‘‘ఈ కుటుంబ దినోత్సవం తమ సంస్థ నిజంగా దేనిని విశ్వసిస్తుందో దానిని ప్రతిబింబిస్తుందనీ, తాము అందించేవి నిర్మాణాలు మాత్రమే కాదు; అవి కుటుంబాలు బలోపేతమై వారి జీవితాలను నిర్మించుకునే పర్యావరణ వ్యవస్థలుగా ఆయన పేర్కొన్నారు. తమ కస్టమర్లు తమపై ఉంచే నమ్మకమే తమ అభివృద్ధికి పునాది అన్నారాయన.
హైదరాబాద్ టెక్నాలజీ కేంద్రం…
ఈ సందర్భంగా హైదరాబాద్ ఒక ప్రముఖ టెక్నాలజీ మౌలిక సదుపాయాల కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన గుర్తు చేశారు. మాట్లాడారు, నగరాన్ని భారతదేశంలో అతిపెద్ద టెక్ ఉపాధి కేంద్రంగా Ð గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు డేటా సెంటర్ పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా ఉంచే గణాంకాలను ఆయన ఉటంకించారు. వేగవంతమైన పట్టణీకరణతో పాటు వచ్చే సవాళ్లను కూడా ఆయన హైలైట్ చేశారు, వాటిలో ఎక్కువ దూరం ప్రయాణించడం, నడవడానికి వీలు లేకపోవడం బహిరంగ ప్రదేశాలపై ఒత్తిడి పెరగడం వంటివి ఉన్నాయి, ఈ పరిస్థితుల్లో మానవ–కేంద్రీకృత నగరాల రూపకల్పన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
ఈ సందర్భంగా మానవ–కేంద్రీకృత డిజైన్ పద్దతిపై దష్టి సారించిన కొత్త డిజైన్ స్టూడియో ని కంపెనీ ఆవిష్కరించింది. ఎఎస్‌బిఎల్ హోమ్స్ యాప్‌తో అనుసంధానించిన కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ ఎఎస్‌బిఎల్ ఫౌండర్స్ క్లబ్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా చిన్నారులకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, కమ్యూనిటీ ఈవెంట్స్..వంటివి నిర్వహిస్తామని తెలియజేసింది.






