ACE Ananta: హైదరాబాద్ లో విల్లాలకు పెరిగిన డిమాండ్… ఆకట్టుకునేలా ఏస్ అనంత విల్లా నిర్మాణం
రియల్ ఎస్టేట్ రంగంలో మంచి డిమాండ్ ఉన్న హైదరాబాద్ నగరంలో ఆకాశ హర్మ్యాలే కాదు.. విల్లా ప్రాజెక్టులు సైతం అత్యధికంగా అమ్ముడుపోతుంటాయి. పచ్చదనం నడుమ, ప్రశాంత వాతావరణంలో సొంత ఇంట్లో ఉండాలనే తపనతో అందరూ అపార్టుమెంట్లను వదిలి విల్లాలవైపు మొగ్గు చూపుతున్నారు. కాలనీల్లో వ్యక్తిగత నివా సాల్లో ఉన్నవారు సైతం సకల సౌకర్యాలతో శివార్లలో నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు విల్లాల నిర్మాణాలను చేపట్టాయి. నగరానికి తూర్పు, ఉత్తరం, దక్షణం వైపు విల్లాల నిర్మాణాలు పెరుగుతున్నాయి. విల్లాల నిర్మాణంలో అధికంగా ట్రిప్లెక్స్ లు ఉంటున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్, పెద్దల పడక గది ఉంటే.. మొదటి అంతస్తులో పిల్లలు, పెద్దల కోసం పడక గదులు, రెండో అంతస్తులో హోంథియేటర్, అభిరుచులు, అతిథుల కోసం గదులను ఏర్పాటు చేసుకుంటున్నారు. 150 చదరపు గజాల నుంచి వెయ్యి చదరపు గజాల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నారు. ఎక్కువ స్థలం ఉంటే ఇంటి ముందు గార్డెన్, వెనక బ్యాక్వర్డ్ వంటి సదుపాయాలను సమకూర్చుకుంటున్నారు.

గుట్టల బేగంపేట, జూబ్లీహిల్స్ ప్రాంతంలో విలాసవంతమైన విల్లా ప్రాజెక్టులు చేపట్టారు. ఇవన్నీ నాలుగు, ఐదు పడకగదుల ట్రిప్లెక్స్ లు. తూర్పు హైదరాబాద్ లో అందుబాటు ధరల్లో విల్లాలు ఉన్నాయి. ఇక్కడ ఘట్ కేసర్, రాంపల్లి, బ్రాహ్మణపల్లి, కొర్రెముల, హయత్ నగర్, తట్టి అన్నారం, వనస్థలిపురం, బండ్లగూడ, ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, రావిర్యాల వరకు పెద్ద సంఖ్యలో విల్లాలు నిర్మిస్తున్నారు. దక్షణ హైదరాబాద్ లో విమానాశ్రయం చేరువలో ఇటీవల పలు ప్రాజెక్టులు మొదలయ్యాయి. అత్తాపూర్, రాజేంద్రనగర్, సాతంరాయి, శంషాబాద్, తుక్కుగూడ, మహేశ్వరం, మన్సాన్ పల్లి, కొత్తూరు వరకు విల్లాలు విస్తరించాయి.
విల్లాల నిర్మాణంలో కొందరు బిల్డర్లు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో మాదిరి విభిన్న థీమ్ లతో నివాస సముదాయాలను అభివృద్ధి చేస్తున్నారు. చుట్టూ అటవీ వాతావరణంతో (ఫారెస్ట్ థీమ్) కడుతున్న ఇళ్లు ఉన్నాయి. ఉత్తర హైదరాబాద్ లో కొంపల్లి, గౌడవెల్లి, మేడ్చల్, దుండిగల్ చుట్టుపక్కల ఎక్కువగా విల్లాలు నిర్మి స్తున్నారు. పశ్చిమ హైదరాబాద్ లో బా బౌరంపేట, గోపన్‌పల్లి, కొల్లూ వుల, నల్లగండ్ల, ఉస్మాన్‌నగర్ పూర్ ప్రాంతాల్లో విల్లా ప్రాజెక్టులు నిర్మితమవుతున్నాయి.

ఏస్ వెంచర్స్ వారు అటవీ వాతావరణంతో కూడిన విల్లాలను నిర్మిస్తున్నారు. నాగోల్ కు సమీపంలో వారి విల్లా ప్రాజెక్టులు కనిపిస్తాయి. 4 ప్లస్ 1 బెడ్ రూమ్ విల్లాలను అనంత పేరుతో వారు నిర్మిస్తున్నారు. ఈ విల్లాలకు సంబంధించిన వివరాలకు ఈ ఫోన్ నెంబర్ లో సంప్రదించండి (Ph: 040 4521 0555) వారి వెబ్ సైట్ ను కూడా చూడండి.
www.aceventures.com/projects/ananta/






