తెలుగువారి భోజనంలో గోంగూర చికెన్‌కి ప్రత్యేక స్థానం ఉంది. పుల్లపుల్లని గోంగూర, కారం కారంగా ఉండే చికెన్ కలిస్తే ఆ రుచే వేరు. దీనికి ఎవరూ నో అనలేరు!
చికెన్ - 1/2 కేజీ, గోంగూర - 2 కట్టలు, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్, పసుపు, కారం, ఉప్పు తగినంత.
నూనె - 4 స్పూన్లు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొద్దిగా జీలకర్ర. రుచికి ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు.
చికెన్‌ను శుభ్రంగా కడిగి, అందులో పసుపు, ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి 30 నిమిషాల పాటు పక్కన ఉంచండి.
బాణలిలో కొద్దిగా నూనె వేసి, శుభ్రం చేసిన గోంగూర ఆకులను వేయండి. అవి మెత్తగా మగ్గే వరకు ఉడికించి, ఆ పేస్ట్‌ని పక్కన పెట్టుకోండి.
వేరే గిన్నెలో నూనె వేడి చేసి, బిర్యానీ దినుసులు, ఎండుమిర్చి వేయించండి. అనంతరం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి వేయించండి.
ఉల్లిపాయలు ఎర్రగా వేగాక, మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. చిటికెడు పసుపు కూడా జోడించండి.
ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్‌ను వేసి బాగా కలపండి. మూత పెట్టి, చికెన్ నుండి నీరు బయటకు వచ్చే వరకు 10 నిమిషాలు మగ్గనివ్వండి.
చికెన్ సగం ఉడికిన తర్వాత, ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర పేస్ట్‌ను వేసి బాగా కలపండి. గ్రేవీ చిక్కబడే వరకు మూత పెట్టి ఉడికించండి.
చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేయండి. అంతే! వేడి వేడి అన్నంలోకి అదిరిపోయే గోంగూర చికెన్ రెడీ. అందరూ ఎంజాయ్ చేయండి!