మరో స్పోర్ట్స్ డ్రామాతో రానున్న ఆమిర్
దాదాపు పాతికేళ్ల క్రితం ఇండియన్ సినీ హిస్టరీలో ప్రత్యేక స్థానం సంపాదించిన లగాన్(lagaan) తర్వాత బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్(Aamir khan), డైరెక్టర్ అశుతోష్ గోవారికర్(Asutosh Gowarikar) మరోసారి కలిసి పనిచేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందనున్న కొత్త సినిమాకు లల్కారా(lalkaara) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్(Excile Entertainement) తో పాటు రాజ్‌కుమార్ హిరానీ(Rajkumar Hirani) కూడా నిర్మాణంలో భాగస్వామిగా ఉండనున్న ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను అక్టోబర్‌లో ప్రారంభించేలా సన్నాహాలు జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ఈ సినిమా 1952లో జరిగిన చారిత్రాత్మక భారత్- పాకిస్థాన్ టెస్ట్ సిరీస్‌ను నేపథ్యంగా తీసుకోనుంది. కేవలం క్రికెట్ మ్యాచ్‌లకే పరిమితం కాకుండా, దేశ విభజన అనంతరం నెలకొన్న సామాజిక, రాజకీయ పరిస్థితులను కూడా కథలో భాగం చేయనున్నట్లు సమాచారం. భారత తొలి టెస్ట్ కెప్టెన్ లాలా అమర్నాథ్(lala amarnath) పాత్రను ఆమిర్ ఖాన్ పోషించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. పీయూష్ గుప్తా(Piyush Gupta), నీరజ్ సింగ్(Neeraj Singh) ఈ సినిమాకు కథా రచన అందించనున్నారు.
లగాన్ ఇప్పటికీ భారతీయ స్పోర్ట్స్ డ్రామాల్లో క్లాసిక్‌గా నిలిచిన నేపథ్యంలో, అదే కాంబినేషన్ నుంచి మరో క్రికెట్ ఆధారిత సినిమా రావడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. గత కొన్నేళ్లుగా అశుతోష్ గోవారికర్‌కు ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోయినా, ఈ ప్రాజెక్ట్‌తో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నారని సినీ వర్గాల విశ్లేషణ. మరోవైపు ఆమిర్ ఖాన్ కూడా నిర్మాతగా పలు ప్రాజెక్ట్‌లను ముందుకు తీసుకెళ్తుండగా, బట్వారా 1947(Batwara1947), అలాగే రాజ్‌కుమార్ హిరానీ(Rajkumar hirani) దర్శకత్వంలో రూపొందనున్న 3ఇడియట్స్ సీక్వెల్(3 Idiots sequel) వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో లల్కారా ఆయన కెరీర్లో మరో ప్రతిష్ఠాత్మక సినిమాగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.








