జైలర్ 2 బిజినెస్‌కు భారీ డిమాండ్.. మలయాళంలో డిస్ట్రిబ్యూటర్ల మధ్య పోటీ!
సూపర్ స్టార్ రజినీకాంత్(rajinikanth) నటించిన జైలర్(Jailer) బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘనవిజయం తర్వాత రూపొందుతున్న జైలర్2(Jailer2)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dileep Kumar) మరోసారి ఈ సీక్వెల్‌ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా, రీసెంట్ గా రిలీజైన రిలీజ్ డేట్ గ్లింప్స్ సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచింది. ముఖ్యంగా దక్షిణాది మార్కెట్లలో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం, మలయాళ మార్కెట్లో జైలర్2 డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం ప్రముఖ సంస్థలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగం అక్కడ రికార్డు రేంజ్ కలెక్షన్స్ సాధించడం, ఈసారి కూడా కథలో మలయాళ స్టార్ మోహన్ లాల్(Mohanlal) కీలక పాత్రలో కనిపించనున్నారనే అంచనాలు ఉండటం వల్ల ఈ సినిమాపై వ్యాపార వర్గాల్లో భారీ ఆసక్తి ఏర్పడింది. అందుకే రిలీజ్ కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ అడ్వాన్స్ డీల్స్, హక్కుల కొనుగోలు డిస్కషన్స్ వేగంగా సాగుతున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తానికి జైలర్2 రిలీజ్ కు ముందే బిజినెస్ పరంగా బలమైన సంకేతాలు ఇస్తోందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రజినీకాంత్ స్టార్డమ్, నెల్సన్ మార్క్ కమర్షియల్ ట్రీట్మెంట్, మోహన్ లాల్ క్రేజ్ కలిసి ఈ సీక్వెల్‌కు అన్ని భాషల్లోనూ భారీ మార్కెట్‌ను తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్(Sun Pictures) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. రిలీజ్ టైమ్ దగ్గరపడే కొద్దీ ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ మరింత పెద్ద స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.








