పిల్లల భవిష్యత్తు కోసం గంట మోగించిన ట్రంప్… అసలు ప్లాన్ ఏంటి?
మన దగ్గర పిల్లల భవిష్యత్తు కోసం బ్యాంక్ డిపాజిట్లు, PPF, సుకన్య సమృద్ధి వంటి పథకాలు ఉంటాయి. కానీ అమెరికాలో మాత్రం మరో అడుగు ముందుకేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిల్లల కోసం Trump Accounts పేరుతో కొత్త పెట్టుబడి పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వైట్ హౌస్ నుంచే ఒకేసారి New York Stock Exchange మరియు Nasdaq ప్రారంభ గంటలను మోగించి దీనికి శ్రీకారం చుట్టారు. చిన్న వయసు నుంచే పెట్టుబడి సంస్కృతిని అలవాటు చేయడం, పిల్లల భవిష్యత్తుకు సంపద సృష్టించడం ఈ పథకం లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు.
ప్రారంభ వారంలోనే సుమారు 800 మిలియన్ డాలర్ల పెట్టుబడులు ఈ ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులను ప్రోత్సహించే ఈ ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
“భారత్లో కూడా పుట్టిన ప్రతి బిడ్డకు ఇలాంటి పెట్టుబడి ఖాతా వస్తే ఎలా ఉంటుంది?”








