మీ ఆఫీసులో కొత్త ఉద్యోగి… కానీ అతను మనిషి కాదు!
ఆఫీసులో మీతో కలిసి పనిచేసే మరో “టీమ్ మెంబర్” ఇక మనిషి కాకపోవచ్చు. ప్రముఖ AI సంస్థ Anthropic తన Claude Tag ఫీచర్‌ను విడుదల చేసింది. దీని ద్వారా Slackలో Claude ఒక సాధారణ చాట్‌బాట్‌లా కాకుండా, టీమ్‌లో శాశ్వత సభ్యుడిలా పనిచేస్తుంది. ట్యాగ్ చేస్తే వెంటనే సమాధానాలు ఇవ్వడం, డాక్యుమెంట్లు వెతకడం, మీటింగ్ నోట్స్ సిద్ధం చేయడం, పనులను సమరీ చేయడం వంటి బాధ్యతలు చేపడుతుంది.
అయితే ఈ కొత్త అడుగు మరో చర్చకు దారి తీసింది.Claude వంటి AIలు ఆఫీసుల్లో కీలక పాత్ర పోషించడం మొదలైతే, కంపెనీల సొంత AIల భవిష్యత్తు ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే AI ఇక ప్రశ్నలకు జవాబులు చెప్పే టూల్ మాత్రమే కాదు… నేరుగా మనతో కలిసి పనిచేసే సహోద్యోగిగా మారుతున్న సంకేతంగా ఈ పరిణామాన్ని టెక్ ప్రపంచం చూస్తోంది.
ఈ పరిణామం మరో చర్చకు తెరలేపింది. “రేపు మన సహోద్యోగి AI అయితే… ఎల్లుండి మన ఉద్యోగమే AI చేస్తుందా?” అనే ప్రశ్న ఇప్పుడు టెక్ ప్రపంచంలో వినిపిస్తోంది.








