AI కొత్త టార్గెట్ ఉద్యోగాలు కాదు… సాఫ్ట్వేర్ కంపెనీలు!
ఒకప్పుడు కంపెనీకి కొత్త సాఫ్ట్వేర్ కావాలంటే… లక్షలు ఖర్చు పెట్టి సాఫ్ట్వేర్ కంపెనీలను ఆశ్రయించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. కంపెనీలే AI సాయంతో తమకు కావాల్సిన సాఫ్ట్‌వేర్‌ను తామే తయారు చేసుకుంటున్నాయి. ఈ మార్పు కొనసాగితే, ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజాల బిజినెస్‌కే AI అతిపెద్ద సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తోంది.
AI ప్రభావం కేవలం ఉద్యోగాలపైనే కాదు… ఇప్పుడు ఖరీదైన బిజినెస్ సాఫ్ట్వేర్ పరిశ్రమపైనా కనిపిస్తోంది. The Information నివేదిక ప్రకారం, చిన్న కంపెనీలు Anthropic రూపొందించిన Claude AI సాయంతో తమ అవసరాలకు తగ్గ కస్టమ్ బిజినెస్ టూల్స్‌ను తామే తయారు చేసుకుంటున్నాయి. దీంతో Salesforce వంటి ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్లపై ఆధారపడటం తగ్గుతోంది.
ఒకప్పుడు లక్షలు ఖర్చు చేసి కొనాల్సిన సాఫ్ట్‌వేర్‌ను, ఇప్పుడు AI సాయంతో తక్కువ సమయంలోనే రూపొందించుకోవడం సాధ్యమవుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే, రాబోయే రోజుల్లో సంప్రదాయ సాఫ్ట్వేర్ కంపెనీల వ్యాపార నమూనాపై AI తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని టెక్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.








