Sonam Kapoor: బనారసీ చీరలో డిఫరెంట్ గా మెరిసిన సోనమ్

బాలీవుడ్ లో ఫ్యాషన్ ను ఎప్పటికప్పుడు ఫాలో అయ్యే నటిగా గుర్తింపు తెచ్చుకున్న సోనమ్ కపూర్(Sonam Kapoor) ఎప్పుడూ సోషల్ మీడియాలో తన లుక్స్ తో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా కర్వాచౌత్(Karvachaut) సందర్భంగా ఓ స్టైలిష్ బనారసీ చీరలో మెరిసిన సోనమ్ చాలా అందంగా కనిపించింది. కర్వాచౌత్ రోజు క్లాసిక్, మోడ్రన్ రెండూ కలగలిపి ఉన్న శారీని ధరించిన సోనమ్, చీరను ఎప్పటిలా కామన్ గా కట్టుకోకుండా కాస్త డిఫరెంట్ గా మోడ్రన్ స్టైల్ లో కట్టుకుని యువరాణి మాదిరి హుందాగా కనిపించగా ఏదైనా సోనమ్ స్టైలే డిఫరెంట్ అంటూ నెటిజన్లు ఆ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.