చట్టం, మానవ హక్కుల పరిరక్షణలో డాక్టర్ శ్రీనివాస్ రావు కావటి ఘనత.. అరుదైన గుర్తింపు
ప్రముఖ న్యాయవాది, కావటి లా ఫామ్ ఫౌండర్ , రామ్సేయర్ అండ్ అసోసియేట్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ రావు కావటి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. న్యాయ వ్యవస్థలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలు, మానవ హక్కుల కోసం చేస్తున్న పోరాటం , అంతర్జాతీయ చట్టపరమైన వ్యవహారాల్లో ఆయన చూపిస్తున్న నాయకత్వానికి గాను పలు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి.
అందుకున్న ప్రధాన అవార్డులు:
నెల్సన్ మండేలా అవార్డు: యునైటెడ్ కింగ్డమ్లోని ఆక్స్ఫర్డ్లో ఈ అవార్డును ప్రదానం చేశారు. సమానత్వం, రాజ్యాంగ విలువల పరిరక్షణ , అందరికీ న్యాయం అందుబాటులోకి తీసుకురావడంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది.
ఇంటర్నేషనల్ కౌన్సిల్ లీడర్షిప్ అవార్డు: అంతర్జాతీయ స్థాయిలో క్లిష్టమైన చట్టపరమైన వ్యవహారాలను డీల్ చేయడంలో , వ్యాపార సంస్థలకు సలహాలివ్వడంలో ఆయన చూపుతున్న నాయకత్వ పటిమకు ఈ గౌరవం దక్కింది.
గ్లోబల్ హ్యూమన్ రైట్స్ లీడర్షిప్ అవార్డు: మానవ హక్కుల ప్రచారం, న్యాయ విద్య , అంతర్జాతీయ సహకారం కోసం ఆయన చేస్తున్న నిరంతర ప్రయత్నాలకు ఈ అవార్డు లభించింది.
కెనడా లెగసీ అవార్డు: మానవతా దృక్పథంతో పేద , వెనుకబడిన వర్గాలకు న్యాయ సేవలందించడంలో చూపుతున్న అంకితభావానికి కెనడాలో ఈ పురస్కారం దక్కింది.
ప్రపంచస్థాయి గుర్తింపు…
డాక్టర్ కావటి వృత్తిపరమైన విజయాలను గుర్తించిన ‘మార్క్విస్ హూ ఈజ్ హూ’ (Marquis Who’s Who) సంస్థ ఆయనను తమ జాబితాలో చేర్చుకుంది. అలాగే, లండన్లోని ప్రతిష్టాత్మక ‘ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ జ్యూరిస్ట్స్’లో ఆయనకు సభ్యత్వం లభించింది. అంతర్జాతీయ సరిహద్దులు దాటి న్యాయ సేవలను అందించడంలో , ప్రపంచవ్యాప్తంగా న్యాయ వ్యవస్థలో మార్పు కోసం ఆయన చేస్తున్న కృషిని అంతర్జాతీయ సమాజం ఈ పురస్కారాల ద్వారా కొనియాడింది.








