హ్వాసంగ్ గ్రూప్ ఉన్నతస్థాయి బృందంతో మంత్రి నారా లోకేష్ భేటీ
ఆంధ్రప్రదేశ్ లో హ్వాసంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయండి
బుసాన్ (సౌత్ కొరియా): ఫుట్ వేర్, మెటీరియల్స్, ఆటోమోటివ్ కాంపొనెంట్స్, ఓడిఎం స్పోర్ట్ ఫ్యాషన్ పరికరాల తయారీలో పేరెన్నికగన్న హ్వాసంగ్ గ్రూప్ (Hwaseung Group – South Korea) ఉన్నతస్థాయి బృందంతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బుసాన్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… కుప్పంలో హ్వాసంగ్ పాదరక్షల తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. దిగుమతులపై ఆధారపడటం తగ్గించి, ఖర్చులను తగ్గించుకోవడానికి, సరఫరాదారులతో అనుసంధానానికి ఇంటిగ్రేటెడ్ ఫుట్ వేర్ కాంపొనెంట్ & మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా కుప్పంలోనే ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రీమియం బ్రాండ్ల కోసం పెర్ఫార్మెన్స్ టెక్నాలజీ, ఏఐ ఫిట్టెడ్ కస్టమైజేషన్, సస్టయినబుల్ మెటీరియల్స్ ను కవర్ చేస్తూ నెక్స్ట్ జెన్ అథ్లెటిక్స్ ఫుట్ వేర్ ఆర్ & డీ, ఆసియా-పసిఫిక్ ఇన్నోవేషన్ సెంటర్ ను ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సేవలందించేలా, ఒక సమగ్ర దక్షిణ భారత తయారీ క్లస్టర్‌ను (కుప్పంలో ప్రధాన కార్యాలయం, తిరుపతిలో విడిభాగాల తయారీ, విశాఖపట్నంలో డిజైన్ మరియు కార్పోరేట్/లాజిస్టిక్స్ విభాగాలు) అభివృద్ధి చేయండి. Hwaseung Footwear టైర్-1, టైర్-2 స్థాయి విక్రేతలతో (vendors) ఒక సప్లయర్ సమావేశాన్ని ఏపీలో నిర్వహించాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
హ్వాసంగ్ కార్పోరేషన్ అఫ్లియేటెడ్ బిజినెస్ సీఈవో హెయో సియోంగ్-రియోంగ్ (Mr. Heo Seong Ryon) మాట్లాడుతూ… హ్వాసంగ్ ఫుట్‌వేర్, కుప్పంలో ₹900 కోట్లతో గ్రీన్‌ఫీల్డ్ నాన్-లెదర్ ఫుట్‌వేర్ ప్లాంట్‌ను ఇప్పటికే ప్రకటించిందని తెలిపారు. అడిడాస్‌తో సహా గ్లోబల్ బ్రాండ్లకు ప్రముఖ OEM సరఫరాదారు అయిన ఈ ప్లాంట్, సంవత్సరానికి 20 మిలియన్ల జతల స్పోర్ట్స్ షూలను తయారుచేస్తుందని అన్నారు. ప్రారంభంలో ప్రధానంగా ఎగుమతి కోసం, ఆ తర్వాత దేశీయ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. హ్వాసంగ్ కార్పోరేషన్ ఆటో విడిభాగాల విభాగం పూణే, చెన్నై, అనంతపురం జిల్లా గూడపల్లిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు. ఈ సమావేశంలో హ్వాసంగ్ ఆటో బిజినెస్ డివిజన్ హెడ్ జియోన్ హ్యూన్ హో, మెటీరియల్ బిజినెస్ డివిజన్ హెడ్ లీ మూ జంగ్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ బిజినెస్ హెడ్ యూన్ జిన్ మిన్, మేనేజ్ మెంట్ డివిజన్ హెడ్ క్వాక్ మ్యుంగ్ చుల్, స్ట్రాటజీ & ప్లానింగ్ డైరెక్టర్ లీ జిన్ సియోక్ (మార్క్ లీ), కాన్స్టాంటిన్ వాసిలీవ్ పాల్గొన్నారు.








