నిజ్జర్ హత్యకేసులో భారత్ కు క్లీన్ చిట్.. కెనడా పోలీసుల ప్రకటన..!
CANADA CLEANCHIT INDIA:
హర్దీప్ సింగ్ నిజ్జర్.. ఖలిస్తానీ ఉగ్రవాది అయిన నిజ్జర్ హత్య కేసులో భారత్ కు క్లీన్ చిట్ లభించింది. గతంలో ఏ నోటితో అయితో నిజ్జర్ హత్యకేసులో భారత్ దోషి అని ప్రకటించిన కెనడా.. ఇప్పుడు అదే నోటితో ఈ కేసులో భారత్ కు ప్రమేయం లేదని స్పష్టం చేసింది. నిజ్జర్ హత్య కేసులో భారత అధికారుల ప్రమేయం ఉందనడానికి ఎలాంటి ఆధారాల లేవని కెనడా పోలీసులు ప్రకటించారు. దీంతో …
భారత్-కెనడా దౌత్యసంబంధాల్లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
నిజానికి నిజ్జర్ హత్య కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా భారత్ హస్తముందని నాటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు . అక్కడితో ఆగకుండా ఈ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో ఇరుదేశాలు పరస్పరం దౌత్యవేత్తలను వెనక్కి పంపించాయి కూడా. తర్వాత మార్క్ కార్నీ అధికారంలోకి వచ్చాక సంబంధాల్లో పునరుద్ధరణ ప్రారంభమైంది.
యూఎస్‌కు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అంతర్జాతీయస్థాయిలో ‘ఆపరేషన్ హార్డ్‌బాల్’ను చేపట్టింది. దానిలో భాగంగా అమెరికా, కెనడా, యూరప్ వ్యాప్తంగా బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన 24 మంది మంది అనుమానితులు అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలోనే బిష్ణోయ్, గోల్డీబ్రార్ అభియోగాలు నమోదయ్యాయి. భారత్‌లోని జైలు నుంచే నిజ్జర్ హత్యకు బిష్ణోయ్ కుట్ర చేశాడని, అతడి ఆదేశాలను ఉత్తర అమెరికాలో బ్రార్ సమన్వయం చేశాడని ఆ అభియోగాల్లో అమెరికన్ ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. ఇందుకోసం స్మగ్లింగ్ చేసిన ఫోన్లు వాడారని ఆరోపించారు. నిజ్జర్ ఫొటో, చిరునామాను బిష్ణోయ్ పంపాడని వెల్లడించారు. గోల్డీపై 50,000 డాలర్ల రివార్డును కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత అధికారుల ప్రమేయం లేదని కెనడా నుంచి స్పష్టత వచ్చింది.
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023లో బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే (Nijjar murder Case). ఈ ఘటన వెనక భారత ఏజెంట్ల హస్తం ఉందంటూ అప్పట్లో కెనడా ప్రధానిగా ఉన్న ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. వీటిని భారత్ తీవ్రంగా ఖండించింది. వాటిని సమర్థించే ఆధారాలు ఇవ్వాలని.. ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని పలుమార్లు స్పష్టంచేసింది. అయినప్పటికీ కెనడా ఈ ఆరోపణలు చేయడం మానుకోలేదు.








