షార్లెట్ వేదికగా TTA మెగా కన్వెన్షన్.. విచ్చేయనున్న ప్రముఖ నటుడు శ్రీ విష్ణు
TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయే ‘మెగా కన్వెన్షన్’ వేడుకలు జులై 17 నుండి 19, 2026 వరకు నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక వేదికపై తెలుగు ప్రేక్షకుల అభిమాన నటుడు శ్రీ విష్ణు అతిథిగా హాజరై సందడి చేయనున్నారు.
నిర్వాహక బృందం..
టీటీఏ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, కో-ఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి , శేఖర్ రెడ్డిల సారథ్యంలో ఈ కన్వెన్షన్‌ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కన్వెన్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు , రిజిస్ట్రేషన్ల కోసం అధికారిక వెబ్సైట్ www.ttaconvention.org ని సందర్శించవచ్చు.








