మాటా ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సదస్సులు.. తేదీ వివరాలు ఇవే!
MATA: ప్రవాస తెలుగు ప్రజలకు చట్టపరమైన అవగాహన కల్పించే లక్ష్యంతో ‘మన అమెరికా తెలుగు సంఘం’ (MATA) ప్రతి నెలా ప్రత్యేక న్యాయ సదస్సులను నిర్వహిస్తోంది. ఈ సదస్సులు ప్రతి నెలా చివరి శనివారం, మధ్యాహ్నం 12:00 నుండి 1:00 (EST) వరకు జూమ్ (Zoom) వేదికగా జరుగుతాయి.
చర్చించే అంశాలు..
ఈ సదస్సుల్లో ఇమ్మిగ్రేషన్, ఫ్యామిలీ లా, రియల్ ఎస్టేట్ లా , బిజినెస్ లా వంటి కీలక అంశాలపై నిపుణులు చర్చిస్తారు.
సంతోష్ ఆర్ సోమిరెడ్డి, భాను బి. ఇలింద్ర, ప్రేమ రోడ్డం, , మధురిమ పటూరి వంటి ప్రముఖ న్యాయ నిపుణులు ఈ కార్యక్రమంలో మోడరేటర్లు/ప్రెజెంటర్లుగా పాల్గొంటున్నారు.
రాబోయే సదస్సుల తేదీలు..
ఆగస్టు 29, 2026
సెప్టెంబర్ 26, 2026
అక్టోబర్ 31, 2026
నవంబర్ 28, 2026
డిసెంబర్ 19, 2026
ఈ సదస్సుల్లో పాల్గొనాలనుకునే వారు https://tinyurl.com/zoom-matacommunityservices లింక్ ద్వారా జూమ్ మీటింగ్లో జాయిన్ అవ్వవచ్చు. మరింత సమాచారం కోసం లక్ష్మీకాంత్ గజూలను (732) 619-7991 నంబర్లో సంప్రదించవచ్చు.








