షార్లెట్ వేదికగా TTA మెగా కన్వెన్షన్.. హాజరుకానున్న సుమంత్ ప్రభాస్
TTA: తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘మెగా కన్వెన్షన్’కు యువ నటుడు సుమంత్ ప్రభాస్‌ను నిర్వాహకులు సాదరంగా ఆహ్వానించారు. ఈ ప్రతిష్టాత్మక వేదికపై ఆయన సందడి చేయనున్నారు.
వేదిక , సమయం..
ఈ భారీ కార్యక్రమం 2026, జులై 17 నుండి 19 వరకు జరగనుంది. నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్ (501 S College St, Charlotte, NC) ఈ వేడుకకు వేదికగా నిలవనుంది.
నిర్వాహక బృందం..
ఈ కన్వెన్షన్‌ను విజయవంతం చేసేందుకు టీటీఏ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ ప్రవీణ్ చింత, కో-ఆర్డినేటర్లు నరేన్ దేవరపల్లి , శేఖర్ రెడ్డి సారథ్యంలో కమిటీలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. కన్వెన్షన్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ www.ttaconvention.org ని సందర్శించవచ్చు.








