ఆటా 19వ సమ్మేళనం.. ఆగస్టు 1, 2 తేదీలలో సాహిత్య కార్యక్రమాలు
ATA: అమెరికన్ తెలుగు సంఘం (ATA) బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా 19వ ఆటా కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్‌ను నిర్వహిస్తోంది. ఈ సమ్మేళనంలో భాగంగా, తెలుగు భాషా, సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేందుకు ఆటా సాహిత్య కమిటీ రెండు రోజుల పాటు ప్రత్యేక సాహిత్య కార్యక్రమాలను రూపొందించింది.
కార్యక్రమ వివరాలు..
ఆగస్టు 1, 2026 (శనివారం):
మధ్యాహ్నం 1:00 గంటలకు సాహిత్య కార్యక్రమాలు , వేడుకలు ప్రారంభమవుతాయి.
మధ్యాహ్నం 2:30 గంటలకు “భాష – సాహిత్యం – సంస్కృతి (నిన్న, నేడు, రేపు)” అనే అంశంపై చర్చా కార్యక్రమం ఉంటుంది.
మధ్యాహ్నం 3:30 గంటలకు కథల పోటీ విజేతలను ప్రకటించి, వారికి బహుమతులు అందజేస్తారు.
ఆగస్టు 2, 2026 (ఆదివారం):
ఉదయం 9:00 గంటలకు “తెలంగాణ చరిత్ర – సంస్కృతిలో మైలురాళ్లు”పై ప్రసంగాలు ప్రారంభమవుతాయి.
ఉదయం 10:30 గంటలకు తెలుగు సామెతలు, పద్యాలపై సరదా పోటీలు నిర్వహిస్తారు.
మధ్యాహ్నం 1:30 గంటలకు డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారి అష్టావధాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది.
మధ్యాహ్నం 3:30 గంటలకు ఉత్తమ కవితల పోటీ , కవి సమ్మేళనం నిర్వహించనున్నారు.
సాహిత్యాభిమానులందరినీ ఈ వేడుకల్లో పాల్గొనవలసిందిగా ఆటా సాహిత్య కమిటీ సాదరంగా ఆహ్వానిస్తోంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.








