అమెరికాపై మెక్సికో ఫైర్..! ఇక లేఖలు కాదు… లీగల్ వార్!
హూస్టన్‌లో ఐసీఈ (ICE) ఏజెంట్లు మెక్సికో పౌరుడు లోరెంజో సల్గాడో అరౌజోను కాల్చిచంపిన ఘటన అమెరికా-మెక్సికో సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై ఇక దౌత్యపరమైన లేఖలు పంపడం మాత్రమే కాదని, అమెరికాపై నేరుగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ స్పష్టం చేశారు.
ఐసీఈ వాదన ప్రకారం… సల్గాడో అరౌజో ఏజెంట్ల వాహనాన్ని ఢీకొట్టి, ఒక అధికారిపైకి వాహనాన్ని దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అతని కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నారు. అతను నిర్మాణ రంగంలో పనిచేసే సాధారణ కార్మికుడని, ఎలాంటి నేర చరిత్ర కూడా లేదని చెబుతున్నారు.
ఈ ఘటనతో “అసలు నిజం ఏంటి?” అనే ప్రశ్న ఇప్పుడు రెండు దేశాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.








