టీటీఏ మహాసభల్లో శ్రీనివాస కళ్యాణం
ఛార్లెట్ వేదికగా జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా పెద్ద పీట వేశారు. ఇందులో భాగంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని కళ్యాణ వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆధ్యాత్మిక కమిటీ చైర్ స్పిరిచువల్ కమిటీ చైర్ మహీజ వాసిరెడ్డి, కో-చైర్ అరుణ్ కోటూరు తెలిపారు. నాలుగు గంటల పాటు ఈ శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. తిరుమల తరహాలోనే ఈ కార్యక్రమాన్ని నిష్టతో నిర్వహి స్తున్నాము. లైవ్ మ్యూజిక్, సన్నాయి మేళతాళాలతో వాతావరణం భక్తిభరితంగా ఉంటుంది.
జూలై 19 ఆదివారం ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు (4 గంటల పాటు) ఈ దివ్య ఘట్టం అత్యంత వైభవంగా జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే విధంగానే ఇక్కడ కూడా ఉదయం సుప్రభాత సేవ నుంచి కళ్యాణోత్సవం సేవ వరకు అన్నీ జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఐదుగురు అర్చకులు మహాసభలకు రానున్నారు సన్నాయి మేళతాళాలు, లైవ్ మ్యూజిక్ మరియు సుప్రభాత సేవతో కార్యక్రమం ప్రారంభమవుతుంది కళ్యాణ సమయంలో ప్రతి ఘట్టాన్ని కిడ్స్ (పిల్లలకు) సైతం సులభంగా అర్థమయ్యేలా వివరించడానికి ప్రత్యేక వ్యాఖ్యానకర్తను కూడా ఏర్పాటు చేశాము. టీనేజర్స్ మరియు ప్రొఫెషనల్ సింగర్స్ పాడే అన్నమాచార్య కీర్తనలతో పాటు, ఇండియా నుండి రాబోయే ప్రముఖ క్లాసికల్ డాన్స్ గ్రూప్ ద్వారా ఒక సర్ప్రైజ్ భక్తిరస నృత్య ప్రదర్శన (సమర్పణ) ఉంటుంది డెకరేషన్ కమిటీ చైర్ అనుష ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకుండా పూర్తిగా ఇండియా నుండి తెప్పించిన తాజా పూలు, గజమాలలతో తిరుపతిని తలపించేలా అలంకరణ చేస్తున్నారు.
తిరుపతి లడ్డూ తరహాలోనే ప్రత్యేక ప్రసాదాన్ని తయారు చేసి, హాజరయ్యే దాదాపు 2500 మంది భక్తులకు అందజేయనున్నాము. ప్రతి ఒక్క ఇంటికి స్వామివారి ప్రత్యేక కానుకను కూడా సర్ప్రైజ్గా అందించనున్నాము.








