అమెరికా వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్న భారతీయులు
అమెరికాలో ఉన్న మైక్రోసాఫ్ట్, గూగుల్ లాంటి అనేక పెద్ద అంతర్జాతీయ కంపనీల సీఈఓలు .. సత్య నాదెళ్ల, సుందర్ పిచ్చయ్ లు మనవాళ్లే అని మనమెప్పుడూ సంతోష పడిపోతూ ఉంటాం. కూసింత గర్వ పడుతూ ఉంటాం. అసలు అమెరికాలో ఉన్న పెద్ద వ్యాపార సంస్థలు ప్రారంభించి, నడుపుతున్నది కూడా మనవారే అంటే.,,
అమెరికలో ఉన్న నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ (National Foundation for America Policy – NFAP) ఈ మధ్యనే ప్రచురించిన స్టాటిస్టిక్స్ ప్రకారం అమెరికాలో ప్రస్తుంత ఉన్న యునికార్న్ కంపెనీలలో (1 బిలియన్ డాలర్ల వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ కంపెనిలను యూనికార్న్ కంపెనీలు అని అంటారు) 59% దాకా ఇమ్మిగ్రెంట్స్ (వలసదారులు) ప్రారంభించి విజయవంతంగా నడుపుతున్నవే అని చెపుతోంది. అంటే మొత్తంగా వున్న 775 కంపెనీలలో 455 కంపెనీలు ఇమ్మిగ్రెంట్స్ ఫౌండర్‌గా లేదా కో ఫౌండర్‌గా ప్రారంభించినవే. అంతే కాదు. ఎనఎఫఎపి సంస్థ 2018-2022లో ఇచ్సిన వివరాలు చూస్తే అప్పుడు 55% మాత్రమే ఉండగా ఇప్పటికి ఆ లెక్కలు 59%కి పెరిగినట్టుగా చూపిస్తున్నాయి. అంతేకాకుండా, అమెరికాలోని 1 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన కంపెనీలలో దాదాపు మూడింట రెండొంతులు (66%) వలసదారులు లేదా వారి సంతానం స్థాపించినవే. ఇంకా, అమెరికాలోని యూనికార్న్ కంపెనీలలో దాదాపు 80% సంస్థల్లో వలసదారులు వ్యవస్థాపకులుగా ఉండటమే కాకుండా, సీఈఓ, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ వంటి కీలక నాయకత్వ స్థానాల్లో కూడా ఉన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, అమెరికాలోని ప్రతి నాలుగు బిలియన్ డాలర్ల కంపెనీలలో ఒకటి (24%)ను అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులుగా వచ్చిన వ్యక్తులు స్థాపించారు. ఈ నివేదిక అత్యాధునిక సాంకేతిక సంస్థల అభివృద్ధిలోనూ, అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతంలోనూ వలసదారులు పోషిస్తున్న కీలక పాత్రను స్పష్టంగా తెలియజేస్తోంది. ముఖ్యంగా, అమెరికా వలస విధానాలు మరింత కఠినంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నివేదిక ప్రాధాన్యత మరింత పెరిగింది.
ఇమ్మిగ్రెంట్స్ ప్రారంభించిన ఈ 455 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. ఇది ప్రపంచంలోని 7 దేశాలు మినహా మిగిలిన అన్ని దేశాల స్టాక్ మార్కెట్లలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ కంటే ఎక్కువ. ఇందులో యునైటెడ్ కింగ్డమ్ మరియు జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా, యూనికార్న్ కంపెనీలను (ఇంకా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కాకపోయినా, కనీసం 1 బిలియన్ డాలర్ల విలువ కలిగిన స్టార్టప్‌లు) కూడా కలుపుకుంటే, వలసదారులు స్థాపించిన కంపెనీల మొత్తం విలువ 5.8 ట్రిలియన్ డాలర్లకు పైగా చేరుతుంది.
2018లో, అమెరికాలో మొత్తం 91 యూనికార్న్ కంపెనీలు ఉండగా, వాటిలో 50 కంపెనీలు (55%) కనీసం ఒక వలసదారుడిచే స్థాపించబడినవి లేదా సహ-స్థాపించబడినవి. కేవలం ఎనిమిదేళ్లలోనే, అంటే 2026 ఏప్రిల్ నాటికి, అమెరికాలో యూనికార్న్ కంపెనీల సంఖ్య 91 నుంచి 775కు పెరిగింది. వీటిలో 455 కంపెనీలు (59%) కనీసం ఒక వలసదా రుడిని వ్యవస్థాపకుడిగా లేదా సహ-వ్యవస్థాపకు డిగా కలిగి ఉన్నాయి. 2016లో వలసదారులు స్థాపించిన యూనికార్న్ కంపెనీల మొత్తం విలువ 168 బిలియన్ డాలర్లు కాగా, 2026 నాటికి అది 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అంటే కేవలం పదేళ్లలోనే 2,876 శాతం వృద్ధి నమోదైంది. ఈ లెక్కల్లో 2016 తర్వాత స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన కంపెనీలు చేరలేదు. అలాంటి కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 837 బిలియన్ డాలర్లకు పైగా ఉంది.
ఈ యునికార్న్ కంపనీలలో భారతీయుల గురించి చూస్తే 2026 నాటికి భారతదేశంలో జన్మించిన పారిశ్రామికవేత్తలు స్థాపించిన లేదా సహ-స్థాపించిన అమెరికన్ యూనికార్న్ కంపెనీల సంఖ్య 96కు చేరింది. ఈ సంస్థలు కృత్రిమ మేధస్సు(ఎఐ), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ వంటి అత్యాధునిక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. భారతీయులు నడుపుతున్న యునికార్న్ కంపెనీలలో ఒక 25 సంస్థలను పరిశీలిస్తే ఆ సంస్థలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ± €]œ¿£ e«edŸœýË ¿¡\¿£ bÍçÔá bþw¾dŸTïH•sTT. Perplexity AI, Nutanix, Rubrik, Zscaler, Postman, Freshworks, Glean, Innovaccer, ThoughtSpot, Cohesity వంటి సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వేలాది కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు, కోట్లాది వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. వీటిలో అనేక కంపెనీలు బిలియన్ల డాలర్ల మార్కెట్ విలువను సాధించగా, కొన్ని ఇప్పటికే అమెరికా స్టాక్ మార్కెట్లలో విజయవంతంగా లిస్టింగ్ అయ్యాయి.
ఈ విజయాల వెనుక ఉన్న భారతీయ వ్యవస్థాపకులు దేశంలోని చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణే, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి ప్రాంతాల నుంచి వచ్చినవారే కావడం విశేషం. సాధారణ కుటుంబాల నుంచి ఎదిగి, ప్రపంచ స్థాయి కంపెనీలను నిర్మించడం ద్వారా భారత యువతకు వారు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వారి విజయాలు ప్రతిభకు భౌగోళిక సరిహద్దులు ఉండవని, ప్రపంచ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకుంటే భారతీయులు ఏ రంగంలోనైనా అగ్రస్థానానికి చేరగలరని నిరూపిస్తున్నాయి.
ఈ 25 యూనికార్న్ కంపెనీలు కేవలం బిలియన్ల డాలర్ల విలువను సృష్టించడమే కాదు, లక్షలాది ఉద్యోగ అవకాశాలను కల్పించి, ప్రపంచ సాంకేతిక రంగ అభివృద్ధికి దోహదపడుతు న్నాయి. అమెరికా ఆవిష్కరణల కథలో భారతీయ వలసదారులు ఇప్పుడు కీలక అధ్యాయంగా మారారు. వారి విజయగాథ భారతదేశ యువతకు ప్రేరణగా నిలుస్తూనే, ప్రపంచ వ్యాప్తంగా భారతీయ మేధస్సు, పారిశ్రామిక దృక్పథం మరియు నాయకత్వ సామర్థ్యాన్ని మరోసారి చాటిచెబుతోంది.
అమెరికా 250 ఏళ్ల స్వాతంత్రాన్ని జరుపుకుంటున్న ఈ సమయంలో అమెరికా లో ప్రస్తుతం ఒక పక్క మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (Make America Great Again) అనే నినాదం, ఇంకో పక్క ఇమ్మిగ్రెంట్స్ మీద కఠినతరమౌతున్న నియమ నిబంధనలు చూస్తూ ఇమ్మిగ్రెంట్స్ పాత్ర అమెరికా పెరుగుదలలో ఎంత ఉందో అని చెప్పడానికే ఈ వ్యాసం రాయడం జరిగింది.








