పఠాన్, జవాన్ ను దాటేసిన కింగ్!
బాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న సినిమాల్లో షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్(king) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్(Siddharth Anand) తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు మరో రికార్డుతో వార్తల్లో నిలిచింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా బడ్జెట్ షారుఖ్ ఖాన్(Shah rukh Khan) పారితోషికం, ప్రింట్ అండ్ పబ్లిసిటీ ఖర్చులు మినహా సుమారు రూ.450 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో గతంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన పఠాన్(pathaan), జవాన్(Jawaan) సినిమాలను దాటేసి, షారుఖ్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన సినిమాగా కింగ్ నిలవనుంది.
ఈ భారీ బడ్జెట్‌కు ప్రధాన కారణం సినిమా నిర్మాణ స్థాయేనని తెలుస్తోంది. ప్రపంచంలోని పలు అంతర్జాతీయ లొకేషన్లలో 150 రోజులకు పైగా షూటింగ్ నిర్వహించగా, యాక్షన్ ఎపిసోడ్స్‌ను అంతర్జాతీయ స్టంట్ టీమ్‌లు డిజైన్ చేశాయి. విజువల్ ఎఫెక్ట్స్ బాధ్యతలను షారుఖ్ సొంత సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్(Red Chillies Entertainments) చేపట్టడం కూడా సినిమాకు మరింత గ్రాండ్ లుక్ తీసుకురానుంది. ఇండియన్ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించాలనే టార్గెట్ తో మేకర్స్ ఎలాంటి రాజీ పడకుండా భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో పాటు సుహానా ఖాన్(Suhana Khan), అభిషేక్ బచ్చన్(Abhishek Bachan), దీపికా పదుకొణె(Deepika Padukone), అనిల్ కపూర్(Anil Kapoor), జాకీ ష్రాఫ్(Jockey Shroff), రాణి ముఖర్జీ(rani Mukherjee), అర్షద్ వార్సీ(Arshad Warsi) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. డంకీ(Dunki) తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఖాన్, 2026 క్రిస్మస్ సందర్భంగా కింగ్ తో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.








