9th July 2026

__________

- Saidulu

వెజ్ పులావ్ రెసిపీ: తక్కువ సమయంలో సూపర్ టేస్టీగా ఇలా చేయండి

సాయంత్రం టీతో ఏదైనా కరకరలాడే స్నాక్ కావాలా? కేవలం 15 నిమిషాల్లో టేస్టీ బ్రెడ్ కట్లెట్‌ను ఇంట్లోనే తయారు చేయండి.

బాస్మతి బియ్యం, క్యారెట్, బీన్స్, బఠానీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, నెయ్యి లేదా నూనె, గరం మసాలా, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క.

కావాల్సిన పదార్థాలు

బాస్మతి బియ్యాన్ని 20–30 నిమిషాలు నానబెట్టండి. దీంతో గింజలు పొడవుగా ఉడికి పులావ్ మెత్తగా కాకుండా పొడిపొడిగా, సువాసనగా తయారవుతుంది.

బియ్యం సిద్ధం చేసే విధానం

పాన్‌లో నెయ్యి వేడి చేసి బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క వేయించండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేయించి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

మసాలా వేయించడం

క్యారెట్, బీన్స్, బఠానీ, అవసరమైతే కాలీఫ్లవర్, క్యాప్సికం వేసి 3–4 నిమిషాలు వేయించండి. దీంతో కూరగాయల రుచి, రంగు బాగా నిలుస్తాయి.

కూరగాయలు కలపడం

నానబెట్టిన బియ్యం, తగినంత నీరు, ఉప్పు, గరం మసాలా వేసి మూతపెట్టి ఉడికించండి. బియ్యం గింజలు విరగకుండా నెమ్మదిగా కలపండి.

బియ్యం ఉడికించడం

చివర్లో ఒక స్పూన్ నెయ్యి, కొత్తిమీర, పుదీనా ఆకులు కలిపితే వెజ్ పులావ్ రెస్టారెంట్ స్టైల్ సువాసనతో మరింత రుచిగా ఉంటుంది.

రుచిని పెంచే చిట్కా

వెజ్ పులావ్‌ను రైతా, పనీర్ కర్రీ, వెజ్ కుర్మా, సలాడ్ లేదా పెరుగుతో సర్వ్ చేస్తే పూర్తి భోజనంగా ఆస్వాదించవచ్చు.

దేనితో తింటే బాగుంటుంది?

కూరగాయలతో తయారైన వెజ్ పులావ్‌లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. సమతుల్య ఆహారంలో భాగంగా మితంగా తీసుకోవచ్చు.