ఆగస్టు 7, 8 తేదీలలో హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి స్వర్ణోత్సవ వేడుకలు
TCA: హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి (TCA) ఆధ్వర్యంలో 50 వసంతాల స్వర్ణోత్సవ వేడుకలు (Golden Jubilee Celebrations) అత్యంత వైభవంగా జరగనున్నాయి. ‘మన భాష – మన సంస్కృతి – మన సంప్రదాయం’ అనే స్ఫూర్తితో నిర్వాహకులు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
వేదిక , తేదీలు..
ఈ స్వర్ణోత్సవ వేడుకలు 2026 ఆగస్టు 7, 8 తేదీలలో టెక్సాస్‌లోని రోసెన్బర్గ్లో గల ‘ఫోర్ట్ బెండ్ ఎపిసెంటర్’ (Fort Bend Epicenter) వేదికగా జరగనున్నాయి. భావితరాలకు మన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని అందించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశం. “సాంప్రదాయం ద్వారా విలువల పెంపు” (Nurturing Values Through Tradition) అనే థీమ్‌తో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పిల్లలకు శ్లోక పఠనం (Sloka Recitation) , వివిధ సాంస్కృతిక పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీల ద్వారా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, భక్తి భావాన్ని ప్రేరేపించడం , మన సంప్రదాయాలను సెలబ్రేట్ చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ కార్యక్రమానికి TCA ప్రెసిడెంట్ యాదగిరి రెడ్డి , కన్వీనర్ జితేందర్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఈ సాంస్కృతిక పోటీలలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. మరిన్ని వివరాల కోసం , రిజిస్టర్ చేసుకోవడానికి tca50.org లేదా www.houstontca.org వెబ్సైట్లను సందర్శించవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే coreeteam@tca50.org ఇమెయిల్ ద్వారా నిర్వాహకులను సంప్రదించవచ్చు.








