ఛార్లెట్ లో ప్రారంభమైన టీటీఏ సందడి…. డాక్టర్ గురవారెడ్డికి స్వాగతం పలికిన నాయకులు
ఛార్లెట్ లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్ 2026 ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇప్పటికే టిటిఎ కు చెందిన పలువురు నాయకులు, సభ్యులు ఛార్లెట్ కు రావడం ప్రారంభించారు. ఈ మహాసభలకోసం ఛార్లెట్ కు వచ్చిన హైదరాబాద్ లోని కిమ్స్-సన్ షైన్ హాస్పిటల్ మేనెజింగ్ డైరెక్టర్, ప్రముఖ ఆర్టోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డికి టిటిఎ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది, ఆయన టీమ్ గురవారెడ్డికి స్వాగతం పలికినవారిలో ఉన్నారు.








