ఛార్లెట్ లో టీటీఏ మహాసభలు 2026.. విజయ్ పాల్ రెడ్డికి ఘన స్వాగతం
ఛార్లెట్ లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) మెగా కన్వెన్షన్ 2026 ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. ఇప్పటికే టీటీఏ కు చెందిన పలువురు నాయకులు, సభ్యులు ఛార్లెట్ కు రావడం ప్రారంభించారు. ఈ మహాసభల కోసం ఛార్లెట్ కు వచ్చిన టిటిఎ అడ్వయిజరీ చైర్ విజయ్ పాల్ రెడ్డికి టీటీఏ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. టీటీఏ ప్రెసిడెంట్ నవీన్ మల్లిపెద్ది, ఆయన టీమ్ స్వాగతం పలికినవారిలో ఉన్నారు. ఆయన సూచనలు, సలహాలతో కాన్ఫరెన్స్ ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా నవీన్ మల్లిపెద్ది చెప్పారు.








