జూలై 17-19 వరకు టీటీఏ మెగా కన్వెన్షన్ ‘సాహిత్య సంగీత వేదిక’
TTA: చార్లెట్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జులై 17 నుండి 19, 2026 వరకు జరగనున్న తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) మెగా కన్వెన్షన్లో భాగంగా ‘సాహిత్య సంగీత వేదిక’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ‘గేయకర్తలకు గీతాంజలి’ అనే ప్రత్యేక సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ గీత రచయిత, గాయకుడు, జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ ప్రసంగించనున్నారు. అలాగే, అమెరికా కోకిల శారదా ఆకునూరి , ధీరజ్ గాత్రంతో ‘గేయకర్తలకు గీతాంజలి’ కార్యక్రమం అత్యంత ఆకర్షణీయంగా సాగనుంది.
నిర్వాహకులు..
ఈ సాహిత్య కార్యక్రమాన్ని టీటీఏ సౌవెనిర్ అండ్ లిటరరీ కమిటీ ఆధ్వర్యంలో శ్రీనివాస్ గుడూరు (డైరెక్టర్), సుధాకర్ ఉప్పల (చైర్) ఇతర కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ఈ కన్వెన్షన్ వివరాల కోసం www.ttaconvention.org వెబ్సైట్ను సందర్శించవచ్చు.








