పారిస్ ఫ్యాషన్ వీక్లో తళుక్కుమన్న సుధారెడ్డి
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పారిస్ ఫ్యాషన్ వీక్ 2026 వేదికపై హైదరాబాద్కు చెందిన మేఘా ఇంజినీరింగ్ (Megha Engineering) అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ డైరెక్టర్, సుధారెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుధారెడ్డి (Sudha Reddy) మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. పారిస్ ( Paris)లో ఈ నెల 6-9 వరకు జరిగిన ఫ్యాషన్ వీక్ (Fashion Week)లో వరసగా మూడు రోజుల మూడు విభిన్న డిజైన్ల వస్త్రధారణ, మిరుమిట్లు గొలిపే వజ్రాల నగలతో తళుక్కుమన్నారు. మూడో రోజు వేడుకలో ఆమె ధరించిన ఆభరణాల కలెక్షన్స్ విలువ సుమారు రూ.250 కోట్లు ఉంటుందని సుధారెడ్డి ఫౌండేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.








