‘‘పినాక’’ ప్రయోగంతో పెరిగిన భారత ప్రతిష్ఠ… ప్రత్యేకతలివే..
‘పినాక’’ దీర్ఘ శ్రేణి గైడెడ్ రాకెట్ ను ఒడిశాలోని చాందీపూర్ నుంచి డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. ఈ ఫ్టైట్ టెస్టులో ఎల్ఆర్జీఆర్ అన్నింటినీ ప్రణాళికా ప్రకారం చేసిందని, లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ శాఖ ప్రకటించింది. ఈ రాకెట్‌ను స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేశారు.2025 డిసెంబర్లో ఇదే రాకెట్ ను 120 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగించారు. ప్రస్తుతం ఈ రాకెట్ పరిధి 60 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల మధ్యలో ఉంది. ఈ ప్రయోగంతో రక్షణ వ్యవస్థకు మరింత బలం చేకూరిందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
పినాకా రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించడానికి భారత సైన్యంలో ప్రస్తుతం వాడుకలో వున్న పినాకా లాంచర్ వ్యవస్థనే వాడారు. దీని ద్వారా ఒకే లాంచర్ సాయంతో వేర్వేరు పరిధులు వున్న ఇతర పినాకా రాకెట్ రకాలను కూడా సులభంగా ప్రయోగించే సామర్థ్యం అని నిరూపితమైంది.
దీని ప్రత్యేకతలు ఇవే…
భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన స్వదేశీ బహుళ బారెల్ రాకెట్ లాంచర్ (MBRL) వ్యవస్థ పినాకా. ఇది కేవలం 44 సెకన్లలో 12 రాకెట్లను ప్రయోగించి, శత్రు స్థావరాలను ధ్వంసం చేయగలదు.
2.ఒడిశాలోని చాందీపూర్ కేంద్రం నుంచి ‘పినాకా’ దీర్ఘ-శ్రేణి గైడెడ్ రాకెట్ (LRGR) ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఈ రాకెట్ కనిష్టంగా 60 కి.మీ పరిధితో లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
3. దీనిని DRDO కు చెందిన పుణె లోని ARDE, HEMRL మరియు హైదరాబాద్‌లోని DRDL, RCI సంస్థలు సంయు్రక్తంగా అభివృద్ధి చేశాయి.
4. ప్రచండ శక్తి: యుద్ధ సమయంలో శత్రు సేనలు గుమిగూడిన ప్రాంతాలు, కమ్యూనికేషన్ కేంద్రాలు మరియు ఎయిర్ టెర్మినల్స్‌పై భారీ స్థాయిలో వినాశనం సృష్టించగలదు.
5. వేరియంట్లు: పినాకా Mk-I (38 కి.మీ దూరం), పినాకా Mk-II (75 కి.మీ దూరం), పినాకా Mk-III (120 కి.మీ దూరం) వంటి వేరియంట్లు అభివృద్ధి చేయబడ్డాయి
6. ఇంటిగ్రేటెడ్ GPS, ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్‌లు కచ్చితమైన లక్ష్యాన్ని నిర్ధారిస్తాయి. ఇండియా అనుకున్న సమయానికి, అనుకున్న ప్రదేశంలో అధిక మందుగుండు సామగ్రితో స్పందించడానికి ఈ పినాకా వ్యవస్థ రెడీగా ఉంటాయి.








