మెట్ గాలాలో మెరిసిన ప్రముఖ వ్యాపారవేత్త సుధారెడ్డి
న్యూయార్క్ వేదికగా జరిగిన మెట్ గాలా (Met Gala)లో ప్రముఖ వ్యాపారవేత్త సుధారెడ్డి (Sudha Reddy) మరోసారి రెడ్ కార్పెట్ పై మెరిశారు. 3 వేల ఏళ్ల పురాతననే మచిలీపట్నం (Machilipatnam) కలంకారీ కళ శైలిలో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ట్రీ ఆఫ్ లైఫ్ గౌను ధరించి ఈ వేడుకలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వస్త్రాల తయారీలో 90 మంది కళాకారులు 3,459 గంటలు పనిచేశారు. నైట్కేప్ పై భాగ్యనగర వృక్ష, జంతుజాలాల ఆకృతులను రేషమ్ జరీతో నేశారు. వెనక భాగంలో అమర్చిన మెట్ వృక్షాకృతి తంగేడు పువ్వు, జమ్మిచెట్టు, సూర్యుడు, చంద్రుడు, కల్పవృక్ష చిత్రాలతో తెలంగాణ నేపథ్యాన్ని ప్రతిబింబించింది. భారతీయ, తెలంగాణ (Telangana) కళకు ప్రపంచ గుర్తింపు తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా సుధారెడ్డి పేర్కొన్నారు. 2024లోను ఆమె ఇలాంటి ప్రదర్శన ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








