హైదరాబాద్లో రోడ్డుకు తన పేరు పెట్టడంపై … స్పందించిన డొనాల్డ్ ట్రంప్
హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం (American Consulate office) పక్కన ఉన్న రహదారికి తన పేరు పెట్టడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆవిష్కరించిన ఫలకాన్ని పంచుకున్నారు. తన పేరుతో రోడ్డుకు నామకరణం చేయడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా గౌరవాన్నిఅందుకున్న తొలి అమెరికా అధ్యక్షుడిని తానేనని వెల్లడించారు.
అమెరికా 250వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 23న హైదరాబాద్లో విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్లోని యుఎస్ కాన్సులేట్ పక్కన ఉన్న రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ(Donald Trump Avenue) గా నామకరణం చేస్తూ రూపొందించిన ప్రత్యేక ఫలకాన్ని అమెరికా రాయబారి సెర్గియో గోర్ (Sergio Gor)తో కలిసి డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) ఆవిష్కరించారు.








