విశ్వంభరకు నాగి మెరుగులు?
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర(Vishwambhara) షూటింగ్ పూర్తి చేసి చాలా కాలమే అయినప్పటికీ, సినిమా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఉంది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన చిత్రబృందం, ప్రతి ఫ్రేమ్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు సమయం తీసుకుంటోందని సమాచారం. ఈ నేపథ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) వీఎఫ్ఎక్స్ వర్క్స్ విషయంలో కీలక సూచనలు అందిస్తున్నారనే ప్రచారం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా, విజువల్ క్వాలిటీని మరింత మెరుగుపర్చే దిశగా ఈ సహకారం ఉంటుందనే టాక్ ఆసక్తిని పెంచుతోంది.
అదే సమయంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సంబంధించి కూడా మరో ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. సినిమాకు సంగీత దర్శకుడిగా ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) వ్యవహరిస్తుండగా, కొన్ని కీలక భాగాల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం గౌర హరి(Gowra Hari) కూడా పని చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. భారీ ఫాంటసీ ప్రపంచాన్ని తెరపై మరింత ఎలివేట్ చేసేలా ఎమోషనల్, యాక్షన్ బ్లాక్స్‌కు స్పెషల్ మ్యూజిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలనే టార్గెట్ తో డెసిషన్ తీసుకున్నారనే డిస్కషన్ జరుగుతోంది. అయితే ఈ అంశాలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.
ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే, విశ్వంభరను దసరా సీజన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే టార్గెట్ తో మేకర్స్ వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నట్లు సమాచారం. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్ వంటి అంశాలపై ఎక్కడా రాజీ పడకుండా అత్యుత్తమ అవుట్‌పుట్ అందించాలనే దిశగా బృందం పనిచేస్తోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రచారంలో ఉన్నట్లుగా నాగ్ అశ్విన్ VFXకు, గౌర హరి బీజీఎంకు సహకరిస్తే, కీరవాణి మ్యూజిక్ తో కలిసి విశ్వంభర విజువల్‌గా మాత్రమే కాకుండా ఎమోషనల్‌గా కూడా మరో స్థాయిలో నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.








