మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు : సీఎం రేవంత్‌రెడ్డి
మూసీ రివర్ బెడ్లో ఉన్నవారికి డబుల్ బెడ్రూం ఇండ్లు (Bedroom houses) ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. మూసీ మొదటి దశ ప్రాజెక్టుపై ఎంసీహెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో సమీక్ష నిర్వహించారు. భూసకరణ కోసం ఆసక్తి ఉన్న వాళ్లకు టీడీఆర్ (TDR) ఇవ్వాలని, లేకపోతే నష్ట పరిహారం చెల్లించాలని సూచించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు (Gandhi Sarovar project) కోసం తీసుకుంటున్న డిఫెన్స్ భూముల్లో ఉన్న నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రజల సందర్శన కోసం మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను నక్లెస్ రోడ్లో ఏర్పాటు చేయాలని, మూసీ ప్రాజెక్టులో చేపట్టబోయే పనులు సెంటర్లో ప్రతిబింబించాలని, ప్రాజెక్టుపైన ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని సీఎం సూచించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయే్‌షరంజన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవల్‌పమెంట్ ఎండీ నర్సింహారెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, సీఎంఓ కార్యదర్శి మాణిక్‌రాజ్, పురపాలకశాఖ అధికారులు పాల్గొన్నారు.








