బాటాతో నా అనుబంధం మరువలేను….దేవిశ్రీ ప్రసాద్
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) శుక్రవారం, జూన్ 26న శాన్ హోసే సివిక్ సెంటర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ లైవ్ షో కోసం సంగీత దర్శకుడు, గాయకుడు దేవిశ్రీ ప్రసాద్ శాన్ హోసె నగరానికి నిన్ననే వచ్చిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ ను హోటల్ షెరాటన్ లో తెలుగు టైమ్స్ ఎడిటర్ వేంకట సుబ్బారావు చెన్నూరి మర్యాద పూర్వకంగా కలిసినపుడు ఆయన ఆప్యాయంగా మాట్లాడారు.
నేను ఇప్పటివరకు అమెరికాకు ఐదారుసార్లు వచ్చి ఆనేక పట్టణాల్లో నా సంగీత విభావరిలు చేశాను. న్యూజెర్సీ, ఫిలడెల్ఫియా , డల్లాస్ లాంటి అనేక పట్టణాల్లో చేశాను. అయితే ఆ పట్టణాలలో అన్ని అన్నిసార్లు ఉండవు. కొన్నిసార్లు కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి. కానీ అమెరికాకు ఎన్నిసార్లు వచ్చినా నా ప్రోగ్రాము మాత్రం శాన్ హోసెలో తప్పని సరిగా ఉంటుంది. దానికి కారణం ఇక్కడ నిర్వాహకులు బే ఏరియా తెలుగు అసోసియేషన్ బాటానే అని చెప్పవచ్చు. అందుకనే ఇక్కడి కమ్యూనిటీకి నాకు ఎంతో అనుబంధం ఏర్పడింది అని చెబుతూ, బాటా వారు చేస్తున్న కమ్యూనిటీ సేవలను ప్రశంసించారు. ఆప్పుడే బాటా పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీలు వెలిగేటి 2008లో దేవిశ్రీ ప్రసాద్ మొదటిసారి చేసిన మ్యూజికల్ షో ఫోటో చూపించారు. ఆ ఫోటో చూడగానే శ్రీ దేవిశ్రీ “చాలా హ్యాపీగా ఉంది. అన్ని గుర్తుకు వస్తున్నాయి. రేపు అంటే శుక్రవారం జూన్ 26 న జరిగే షో శాన్ హోసే కమ్యూనిటీ ను అలరించడానికి మేము కూడా బాగా ప్రిపేర్ అవుతున్నాం. మీకు ఇష్టమైన, మీరందరూ మెచ్చే పాటలను రెడీ చేసుకున్నాం. మీ అందరూ తప్పకుండా ఈ షో కి వచ్చి ఎంజాయ్ చెయ్యండి” అని అన్నారు.
పక్కనే ఉన్న బాటా పాస్ట్ ప్రెసిడెంటు వీరు ఉప్పాల మాట్లాడుతూ ఇప్పటివరకు దేవి శ్రీ ప్రసాద్ అమెరికాకి 5 సార్లు వచ్చారని, ఇది ఐదవ సారి అని, వచ్చిన ప్రతిసారి బే ఏరియా తెలుగు అసోసియేషన్ కి షో నిర్వహించే అవకాశం ఇవ్వడం మా అదృష్టం అని అన్నారు. మొదటిసారి 2008లో ఆ తర్వాత 2014, 2018, 2023లలో వచ్చారని ప్రతి షో విజయవంతంగా ముగిసాయి అని అన్నారు. రేపటి షో కూడా అందర్నీ అలరిస్తుందని అనుకుంటున్నాము. ఇప్పటికే చాలా వరకు టికెట్లు అయిపోయాయి. హౌస్ ఫుల్ గా ఉంటుంది అని అన్నారు.
ఈ సంగీత విభావరి టికెట్ల కొనుగోలుకై www.bata.org వెబ్సైట్ను సందర్శించవచ్చు లేదా పోస్టర్లోని QR కోడ్ను స్కాన్ చేయవచ్చు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్లు: 510-421-3535 లేదా 650-776-1203 ను సంప్రదించవచ్చు.









