ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత
దక్షిణ భారత చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత కె. భాగ్యరాజ్ (73) గుండెపోటుతో చెన్నైలో ఆకస్మికంగా కన్నుమూశారు.అయితే ఆయన తన గురువు చనిపోయిన 17 రోజులకే మరణించడం గమనార్హం.
తన సుదీర్ఘ సినీ కెరీర్లో దాదాపు 75 చిత్రాల్లో నటించిన ఆయన, 25 సినిమాలకు అద్భుత దర్శకత్వం వహించారు. ‘అంద 7 నాట్కల్’, ‘ముంధనై ముడిచ్చు’ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించిన భాగ్యరాజ్, ఉత్తమ నటుడిగా తమిళనాడు ప్రభుత్వ అవార్డును అందుకున్నారు. ఆయనకు భార్య పూర్ణిమ, కుమార్తె శరణ్య, కుమారుడు శాంతను ఉన్నారు. భాగ్యరాజ్ ఆకస్మిక మరణం పట్ల టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు.








