ప్రముఖ నటుడు, దర్శకుడు భాగ్యరాజా ఆకస్మిక మృతికి ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ శ్రద్ధాంజలి!
ప్రముఖ నటుడు, దర్శకుడు మరియు ‘స్క్రీన్ప్లే ల్యాబ్’గా వెండి తెర ప్రముఖులచే కీర్తించబడిన కె. భాగ్యరాజ్ గారి ఆకస్మిక మృతి చలనచిత్ర రంగానికి తీరని లోటు. 73 సంవత్సరాల వయసులో ఈ రోజు ఉదయం (జూన్ 27, 2026) ఆయన చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
మధ్యతరగతి కుటుంబాల కథలకు సున్నితమైన హాస్యంజత చేసి వెండితెరపై ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన ధన్యజీవి
స్క్రీన్ప్లే మహారాజుకు సుమ సున్నిత విమర్శక నయనాల శ్రద్ధాంజలి!!!
కథల నవాబు ! కానరాని లోకాలకు తరలి పోయావా?
వెండితెరపై సామాన్యుడి నాడిని పట్టిన వినోద వైద్య వేదానివి”!!
సున్నితమైన హాస్యంతో సమాజాన్ని నవ్వించిన విజ్ఞాన వీచిక!! మలగని సినీ జ్ఞాన దీపిక!!
చిరునవ్వుల వెనుక భావోద్వేగాల లోతును చూపిన దర్శక దార్శనిక చక్రవర్తివి!!
సినిమా కథనానికి కొత్త శైలిని నేర్పిన చిత్ర వాల్మీకి!!
తొలి అడుగులోనే ‘సువర్ ఇల్లద చిత్రంగళ్’ అన్నావు!!
ప్రేక్షకుల హృదయ ఫలకాలపై చెరగని చిత్రాలెన్నో గీశావు.
మూడు ముళ్ళ బంధాన్ని ‘ముందనై ముడిచ్చు’గా ముడి వేసి,వెండితెరకు సరికొత్త స్క్రీన్ప్లే పాఠాలు నేర్పావు. నటుడిగా మెప్పించావు, దర్శకుడిగా అద్భుత చిత్రాలను వెండి తెరపై మలిచిన అమర శిల్పి!!
రచయితగా ప్రతి గుండెను సున్నితంగా స్పృశిం చావు. నువ్వు సృష్టించిన ప్రతి పాత్ర ఒక సజీవ సాక్ష్యం, చిత్రసీమలో నీ ప్రయాణం ఎప్పటికీ ఒక ఆదర్శం.
సినిమా విమర్శకుల కలాలకు నువ్వొక అద్భుత సవాలువి, రాసే ప్రతి సమీక్షలోనూ కచ్చితంగా నిలిచే మేరునగ దీరునివు!!
నువ్వు లేని లోటు తీర్చ లేనిది, పూడ్చలేనిది, నీవు విడిచిన జ్ఞాపకాల ప్రయాణం తరగని జ్ఞాననిధి.
భౌతికంగా నువ్వు మా మధ్య లేకపోయినా, నీ కథలు, నీ దృశ్యాలు, నీ ట్రెండ్ ఎప్పటికీ సజీవమే.
కథల రారాజు, స్క్రీన్ప్లే చక్రవర్తి కె. భాగ్యరాజ్ గారికి, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ తరఫున ఇదే మా అశ్రునయనాల అక్షర స్మృత్యంజలి!
వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు మరియు అభిమానులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.- జె వి ప్రసాద్ఫి రావు, అధ్యుక్షులు, సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్.








