ఓర్లాండోలో ఆటా పోటీలకు మంచి స్పందన
అమెరికా తెలుగు సంఘం (ఆటా) మహాసభలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ‘ఝుమ్మంది నాదం’ గాన పోటీలు, ‘సయ్యంది పదం’ నృత్య పోటీలకు వివిధ ప్రాంతాల్లో మంచి స్పందన వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఓర్లాండోలో నిర్వహించిన పోటీల్లో జాక్సన్విల్, టాంపా తదితర నగరాల నుంచి వచ్చిన పోటీదారులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ నీలిమ కటుకూరి, ప్రాంతీయ సమన్వయకర్త సుహాసిని కోసనం, ప్రాంతీయ సలహాదారు డాక్టర్ బుచ్చి రెడ్డి, మహిళా విభాగ సమన్వయకర్త ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీల విజేతలు మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్‌లో జులై 31 నుండి ఆగష్టు 2 వరకు జరగనున్న ఆటా 19వ మహాసభల్లో జరిగే ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో భగాంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో మహిళలు సాంప్రదాయ వస్త్రధారణతో ప్రేక్షకులను అలరించారు.








