టీమిండియా స్టార్ బ్యాటర్‌పై శ్రీకాంత్ తీవ్ర ఆగ్రహం..!
భారత క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ(Tilak Varma) ప్రదర్శనపై టీమిండియా మాజీ ఓపెనర్, 1983 ప్రపంచ కప్ విజేత కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో తిలక్ వర్మ పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తుండటం, ముఖ్యంగా షార్ట్ పిచ్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో పూర్తిగా తడబడుతుండటంపై శ్రీకాంత్ మండిపడ్డారు. తిలక్ వర్మకు క్రీజులో ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదని, అతడిని వెంటనే జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఒక వైస్ కెప్టెన్‌గా ఉంటూ పేస్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు భయపడుతున్నాడని తన యూట్యూబ్ ఛానెల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడో టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ 11 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయి, ఇంగ్లాండ్ గడ్డపై తమ అత్యల్ప టీ20 స్కోరును నమోదు చేసింది. తిలక్ వర్మ బలహీనతను గుర్తించే మేనేజ్మెంట్ అతడి కంటే ముందు అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్‌కు పంపిస్తూ రక్షించే ప్రయత్నం చేస్తోందని శ్రీకాంత్ ఆరోపించారు.
ఇన్ని వైఫల్యాలు ఉన్నా సెలెక్టర్లు అతడిని ఎందుకు జట్టులో కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తిలక్ వర్మ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను(sanju Samson) జట్టులోకి తీసుకోవాలని శ్రీకాంత్ సలహా ఇచ్చారు. వరుస వైఫల్యాల వల్ల శాంసన్‌ను పక్కనపెట్టి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చినప్పటికీ, అతడు కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో రాబోయే మ్యాచ్‌లలో సంజూ శాంసన్‌ను తిరిగి తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా నాలుగు టీ20 మ్యాచ్‌లు ఓడిపోయిన భారత్.. మరో సిరీస్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే రాబోయే రెండు మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.








