సీతారాంపూర్ లో సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
సీతారాంపూర్ లో సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ నుప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు….
రాజకీయంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం.
తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాం.
కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీ లాంటి నగరాల్లో నివసించలేని పరిస్థితి.
బెంగుళూరు, చెన్నై వంటి నగరాలలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది.
మెట్రో పాలిటన్ నగరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
అందుకే హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత అభివృద్ధి జరగాలని నిర్ణయించాం.
అందుకే ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 2100 చ.కి.మీ విస్తీర్ణంలోని ఛూఋఏ ఏరియాను పూర్తిగా సర్వీస్ సెక్టార్ గా నిర్ణయించాం.
తెలంగాణను ఛూఋఏ, ఫూఋఏ, ఋఆఋఏ ఏరియాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమిగా తెలంగాణను తీర్చిదిద్దాలని సంకల్పించాం.
దేశ అధిక వ్యవస్థలో తెలంగాణ 10 శాతం భాగస్వామ్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
ప్రపంచంతో పోటీ పడాలంటే ఇప్పుడున్న పెట్టుబడులు సరిపోవు.
పెట్టుబడులు రావాలంటే అందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉంది.
యువతకు నైపుణ్యం అందించేందుకు ఏటీసీలతో పాటు స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం.
సీతారాంపూర్ లో సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభించుకోవడం సంతోషం.
గ్రామంలో భూములు కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇంటి పట్టాలు, ఉపాధి కోసం వ్యాపార సముదాయాలను నిర్మించి ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశిస్తున్నా.
రంగారెడ్డి జిల్లా రైతులు త్యాగం చేయడం వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైంది.
చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తాం.
బుద్వేల్ నుంచి కొడంగల్ వరకు 100 మీటర్ల రోడ్డు నిర్మాణం జరుగుతోంది.
రాజకీయాలకు ఇది సమయం కాదు.. ఎన్నికలప్పుడే రాజకీయాలు.
అధికారం కోల్పోయిన బాధ మీకు ఉన్నా… అభివృద్ధి జరగనివ్వండి.
మమ్మల్ని కొన్నాళ్లు పని చేయనివ్వండి..
ప్రజలందరి సహకారంతో 2030 నాటికి 1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం .
త్వరలోనే ఇక్కడ ఆలయ ప్రారంభోత్సవానికి వస్తా.. మళ్లీ మీ అందరినీ కలుస్తా.








