శ్రీసిటీలో మోటివ్ లింక్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయండి : మంత్రి లోకేష్
మోటివ్ లింక్ సీఈవో కిమ్ కి-హాన్ తో మంత్రి లోకేష్ భేటీ
సియోల్ (సౌత్ కొరియా): దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్, పాసివ్ కాంపొనెంట్స్ తయారీ సంస్థ మోటివ్ లింక్ (MOTIVELINK) సీఈవో కిమ్ కి-హాన్ (Mr. Kim Ki-han), ఇంటర్నేషనల్ సేల్స్ అండ్ రీసెర్చ్ జనరల్ మేనేజర్ బైద్య శర్మతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో ఈవీ విడిభాగాలు (EV ICCU విడిభాగాలు), SMD / PBA ఉత్పత్తి, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్, ఇతర EV మాగ్నెటిక్స్ విడిభాగాలు తయారు చేసే యూనిట్ ను ఏర్పాటు చేయండి. ఇందుకు అవసరమైన విద్యుత్, నీరు, లాజిస్టిక్స్ వంటి మౌలిక సదుపాయాలతో కూడిన భూమి శ్రీసిటీలో సిద్ధంగా ఉంది. ఏపీలోని స్పేస్ సిటీ, స్కైరూట్, AMCA వంటి రక్షణరంగ తయారీ యూనిట్లలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించండి. MCNEX, సోలమ్, LG ఎలక్ట్రానిక్స్, LG కెమ్ వంటి ఇతర కొరియన్ కంపెనీలతో పాటు శ్రీసిటీలో మోటివ్ లింక్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
మోటివ్ లింక్ (MOTIVELINK) సీఈవో కిమ్ కి-హాన్ మాట్లాడుతూ… భారతదేశంలో గ్రీన్‌ఫీల్డ్ EV-కాంపోనెంట్స్ (ట్రాన్స్ఫార్మర్లు/ DC కన్వర్టర్లు) ప్లాంట్ కోసం స్టెర్లింగ్ టూల్స్‌తో ఒక టెక్-లైసెన్స్ జాయింట్ వెంచర్ ను మోటిలింక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడులోని చెన్నైలో సెప్టెంబర్ 2025లో స్థాపించిందని తెలిపారు. భారత్ లో తమ సంస్థ మొదటి స్వతంత్ర ప్లాంట్ తమిళనాడులోని శ్రీపెరంబుదూర్-ఒరగడమ్-చెన్నై ఆటో క్లస్టర్లో ఉందని అన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని కిమ్ కి-హాన్ తెలిపారు.








