ఈ నెల 19 న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన కేంద్రం
పార్లమెంట్ వర్షారంభ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 న అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ నెల 19 న ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో ప్రభుత్వం తన ఎజెండాను వివరించనుండగా, ప్రతిపక్షాలు తాము సభలో లేవనెత్తే కీలక అంశాలను ప్రస్తావించే ప్రస్తావించే అవకాశం ఉంది.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదికగా తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో ఈ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ఆగస్టు 13 వరకు జరగనున్నాయి. దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై అర్థవంతమైన చర్చలు, నిర్ణయాలు ఈ సమావేశాల్లో జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
అయితే.. ఈ సారి పార్లమెంట్ సమావేశాల్లో సభను కుదిపేసే కొన్ని అంశాలున్నాయి. వాటిని ప్రభుత్వం ఎలా ఎదుర్కుంటుందా? అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు ప్రధానంగా ప్రస్తావించనున్నాయి.
అలాగే ‘ఆపరేషన్ సిందూర్’ ప్రాణనష్టానికి సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయనపై బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్(సభా హక్కుల ఉల్లంఘన) నోటీసు ఇచ్చింది.
దీంతో పాటు మరో కీలక అంశం 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ.. వరుసగా 30 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో(జైల్లో) ఉంటే, సదరు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా కేంద్ర/రాష్ట్ర మంత్రులు స్వయంచాలకంగా(Automatic) తమ పదవులను కోల్పోవాలనే నిబంధనను ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.
వీటితో పాటు అయోధ్య రామ మందిర విరాళాల విషయంలో జరిగిన అవకతవకలపై కూడా విపక్షాలన్నీ కలిసి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశాలున్నాయి.








