డిసెంబర్ లో సొంత దేశానికి మాజీ పీఎం షేక్ హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా డిసెంబర్ లో సొంత దేశానికి వెళ్లనున్నట్లు నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆమె భారత్ లో శరణార్థిగా వుంటున్నారు. బంగ్లాదేశ్ కి వెళితే అరెస్ట్ లేదా మరణం సంభవించే ప్రమాదం వున్నా.. వెళ్లాలనే నిర్ణయించుకున్నారు.అంతేకాకుండా స్వదేశానికి వెళ్లి, న్యాయస్థానాల ముందు లొంగిపోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.
డిసెంబర్ లో సొంత దేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, అయితే ఢాకాతో ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదని షేక్ హసీనా అన్నారు. “నేను తిరిగి వెళ్ళినప్పుడు వారు నన్ను అరెస్టు చేయవచ్చు, నన్ను చంపేయవచ్చు కూడా,” అని షేక్ హసీనా అన్నారు. “అయినప్పటికీ, నేను వెళ్లాల్సిందే.” అని ప్రకటించారు.
ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఒచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. తాను అరెస్ట్ కావడానికి లేదా చావడానికైనా సిద్ధంగా వున్నానని సంచలన ప్రకటన చేశారు. అయితే.. బంగ్లాదేశ్ సర్కార్ తో మాత్రం తాను ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదని తేల్చి చెప్పారు. ‘‘స్వదేశానికి వెళ్లిన తర్వాత వాళ్లు నన్ను అరెస్ట్ చేయవచ్చు. చంపేసే అవకాశమూ వుంది. అయినా నేను వెళ్లాలి. నా పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. మరణం సంభవించినా, నా తల్లిదండ్రులను ఖననం చేసిన చోట, నా సొంత గడ్డపైనే చనిపోవాలని కోరుకుంటున్నా’’ అని ప్రకటించారు.
భారత్ కి షేక్ హసీనా ఎందుకు వచ్చారు?
బంగ్లాదేశ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో 2024 ఆగస్టు మాసంలో బంగ్లాదేశ్ ని విడిచి, షేక్ హసీనా భారత్ కి వచ్చేసి, ఆశ్రయం పొందుతున్నారు. . అప్పటివరకు ప్రధానిగా ఉన్న ఆమె తన పదవికి రాజీనామా చేసి, అత్యవసరంగా సైనిక హెలికాప్టర్లో భారత్లోని హిందాన్ ఎయిర్ బేస్కు చేరుకున్నారు. అప్పటినుంచి ఆమె భారతదేశంలోనే తలదాచుకుంటున్నారు.








