అమరావతిలో శాంసంగ్ ఆర్ & డీ విభాగాన్ని ఏర్పాటు చేయండి : మంత్రి లోకేష్
శాంసంగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ జో యున్ తో మంత్రి లోకేష్ భేటీ
సియోల్ (సౌత్ కొరియా): శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ ఎఫైర్స్) యంగ్ జో యున్ (Mr. Young Joe Yun), గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్ హెడ్ నామ్ సూ పార్క్ (Mr. Namsoo Park)తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని 10 GW డేటా-సెంటర్ పైప్‌లైన్‌ను కేంద్రంగా చేసుకుని, డేటా సెంటర్లు, సర్వర్ తయారీ, సర్వీసింగ్‌తో కూడిన పూర్తి AI-కంప్యూట్ స్టాక్ కోసం భారత్ లో ఆంధ్రప్రదేశ్‌ను శాంసంగ్ కేంద్రంగా మార్చాల్సిందిగా కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ-రెడీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్లను సంయుక్తంగా అభివృద్ధి చేయడంతోపాటు ఏపీలో AI-సర్వర్ తయారీని లోకలైజ్ చేయడానికి ముందుకు రండి. ఏపీలో ఒక డిస్ప్లే ఫ్యాబ్ ను ఏర్పాటుచేసే అవకాశాలను పరిశీలించండి. విశాఖపట్నంలోని ISM OSAT క్లస్టర్‌ను కేంద్రంగా చేసుకుని, ఆంధ్రప్రదేశ్‌లో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ కోసం ఒక OSAT సదుపాయాన్ని ఏర్పాటుచేసే అవకాశాలను అన్వేషించండి. రాష్ట్ర పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు మద్దతుగా, ఆంధ్రప్రదేశ్‌లో మొబైల్, డివైస్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయండి.
అమరావతి రాజధాని నగరం, పారిశ్రామిక మౌలిక సదుపాయాల నిర్మాణంలో శాంసంగ్ భాగస్వామి కావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ 133-క్యూబిట్ IBM క్వాంటం సిస్టమ్ టూపై పరిశోధన చేయడానికి, శాంసంగ్ యొక్క ఆర్&డీ విభాగాన్ని అమరావతి క్వాంటం వ్యాలీలోకి తీసుకురండి. శాంసంగ్ తన బహుళ విభాగాలకు నిలయంగా ఉండేలా ఒక ప్రత్యేక ‘శాంసంగ్ సిటీ’ని ఏపీలో నిర్మించాల్సిందిగా మంత్రి లోకేష్ ప్రతిపాదించారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ ఎఫైర్స్) యంగ్ జో యున్ మాట్లాడుతూ… ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చిస్తామని అన్నారు.








