అయోధ్య ట్రస్ట్ నూతన ప్రధాన కార్యదర్శిగా బజరంగ్ బాగ్రా.. ఆయన నేపథ్యమిదీ
అయోధ్యలోని శ్రీ రామ మందిర విరాళాల చోరీ నేపథ్యంలో శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోమవారం కీలక సమావేశం నిర్వహించింది. రాజీనామాలు చేసిన చంపత్ రాయ్, అనిల్ మిశ్రా రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. అలాగే ట్రస్ట్ నూతన ప్రధాన కార్యదర్శిగా బజరంగ్ బాగ్రాను నియమిస్తున్నట్లు ట్రస్ట్ కీలక ప్రకటన చేసింది.
బజరంగ్ బాగ్రా ఎవరంటే….
బజరంగ్ బాగా ప్రస్తుతం VHP అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. VHP సంస్థాగత అనుభవాల్లో విశేష అనుభవం గడించారు.ఈయన ప్రస్తుతం అయోధ్యలో జరిగిన సంస్థ యొక్క ‘ప్రన్యాసీ మండల్’ మరియు నిర్వహణ కమిటీ సమావేశంలో ఎన్నికైన తర్వాత, 2 ఆయన ఫిబ్రవరి 2024 నుండి ఈ పదవిని నిర్వహిస్తున్నారు.
వృత్తి రీత్యా బాగ్రా ప్రసిద్ధ ఛార్టెడ్ అకౌంటెంట్. ఈయన స్వస్థలం రాజస్థాన్ లోని సికార్ జిల్లాకు చెందిన వారు. VHP లో సంస్థాగతమైన బాధ్యతలు చేపట్టడానికి పూర్వం ఆయన సీఏగా పనిచేశారు. అలాగే గతంలో కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో)కు ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా పనిచేశారు. అంతకుముందు, ఆయన నాల్కో మరియు రైట్స్ లిమిటెడ్లో డైరెక్టర్ (ఫైనాన్స్) మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవులను కూడా నిర్వహించి, ఆర్థిక నిర్వహణ మరియు కార్పొరేట్ పాలనలో విస్తృతమైన అనుభవాన్ని గడించారు.
NALCOలో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత, బగ్రా VHP కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆ సంస్థలో జాయింట్ జనరల్ సెక్రటరీ వంటి పలు కీలక బాధ్యతలు నిర్వహించడంతో పాటు, ఆయన ‘ఏకల్ అభియాన్’కు అధ్యక్షుడిగా మరియు CEOగా కూడా సేవలందించారు.








